28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

హైదరాబాద్ మెట్రో రైల్ 5వ వార్షికోత్సవ వేడుకలు… ప్రయాణికులకు బోనస్!

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ 5వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా యాత్రికులకు లాయల్టీ బోనస్‌ను గురువారం ప్రకటించింది. లాయల్టీ కస్టమర్లకు ఈ బెనిఫిట్ అందుబాటులో ఉండనుంది. అధికారులు ఈ మేరకు ఎంపిక చేసిన స్మార్ట్ కార్డ్ ఐడీల వివరాలతో కూడిన జాబితాను విడుదల చేశారు. రెగ్యులర్ మెట్రో ప్రయాణికులు ఈ ఐడీ కార్డుల వివరాలను చేసుకోవచ్చు. వారి కార్డు వివరాలను వీటితో మ్యాచ్ అయితే వారికి లాయల్టీ బోనస్ బెనిఫిట్ లభిస్తుంది.

మీ ఐడీ ఎంపిక చేసిన నెంబర్లలో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మీ ఐడీ నెంబర్ ఎంపిక చేసిన స్మార్ట్ కార్డు ఐడీల లిస్ట్‌లో ఉంటే.. వెంటనే మీ వివరాలను 040 23332555 నెంబర్‌కు కాల్ చేసి చెప్పొచ్చు. లేదంటే వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 7995999533 అనేది వాట్సాప్ నెంబర్. ఈ వివరాలను హైదరాబాద్ మెట్రో రైల్ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.

నవంబర్ 28 వ తేదీ, మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రయాణీకులు తమ వివరాలను పంపొచ్చు. లేదంటే మీరు లాయల్టీ బోనస్ బెనిఫిట్‌ను కోల్పోవలసి ఉంటుంది. అందువల్ల మీరు రెగ్యులర్‌గా మెట్రోలో జర్నీచేస్తూ ఉంటే.. ఆలస్యం దేనికి… తక్షణమే మీమీ స్మార్ట్ కార్డు ఐడీ నెంబర్లను కింద ఇవ్వబడిన నంబర్లతో సరిచూసుకోండి.

హైదరాబాద్ మెట్రో రైల్ లాయల్టీ బోనస్ కోసం ఎంపిక చేసిన ఐడీల వివరాలు ఇలా ఉన్నాయి : 10100003890119, 101000010715659, 10100001417850, 10100004374980, 10100000006433, 10100001930276, 10100002449022, 10100001214385,  1010029752975297529752975297529

మీ ఐడీ నెంబర్ ఇందులో ఉంటే.. మీకు లాయల్టీ బోనస్ వచ్చినట్లే. వెంటనే మీ వివరాలను కాల్ చేసి లేదంటే వాట్సాప్ ద్వారా హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులకు తెలియజేయండి. ఈ బంపర్ ఆఫర్‌ను మిస్ చేసుకోవద్దు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles