24.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

డిసెంబర్ నెలలో నిరుద్యోగులకు శుభవార్త… వరుస నోటిఫికేషన్లు ఇవ్వనున్న టీఎస్‌పీఎస్‌సీ!

హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాలను ఆశించేవారికి డిసెంబర్ నెలలో శుభవార్త చెప్పడానికి టీఎస్‌పీఎస్‌సీ సిద్ధంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వరుస ఉద్యోగ నోటిఫికేషన్‌లను విడుదల చేయడానికి సంసిద్ధమవుతోంది. ఈ ఉద్యోగాలను రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం ఇవ్వడమే తరువాయి. డిసెంబర్ నెలలో 726 గ్రూప్-II పోస్టులు, గ్రూప్-III ద్వారా 9,168 పోస్టులు, అంతేకాదు గ్రూప్ IV ఖాళీల కోసం ఉద్యోగ నోటిఫికేషన్‌లను జారీ చేయడానికి టీఎస్‌పీఎస్‌సీ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రూప్ II, III మరియు IV సేవలకు కొత్త పోస్టులను  ప్రకటించినందున గ్రూప్-III పోస్టుల్లో ఖాళీల సంఖ్య పెరగవచ్చు.

తెలంగాణ ప్రభుత్వం TSPSC ద్వారా 9,168 గ్రూప్-IV ఖాళీలను భర్తీ చేయనుంది. జీఓ నెం.55కి చేసిన సవరణ ప్రకారం గ్రూప్-2లో కొత్తగా ఆరు పోస్టులు, గ్రూప్-3 సర్వీసుల్లో రెండు కేటగిరీల పోస్టులు, గ్రూప్-IV సర్వీసుల్లో నాలుగు కేటగిరీల పోస్టులు చేర్చారు.

ఇంతకుముందు, ఆర్థిక శాఖ 663 గ్రూప్-II ఖాళీలకు రిక్రూట్‌మెంట్ కోసం అనుమతించింది. అయితే, గ్రూప్-II సర్వీసులకు కొత్త పోస్టులను చేర్చడంతో ఈ పోస్టులు 726కి చేరుకున్నాయి. అదేవిధంగా, గ్రూప్-III సేవల కింద రిక్రూట్ చేయాల్సిన పోస్టుల సంఖ్య పెరగవచ్చు.

నోటిఫికేషన్ జారీ ప్రక్రియను వేగవంతం చేయడం, నియామకాల కోసం, టీఎస్‌పీఎస్‌సీ నేటినుంచి నుండి వివిధ శాఖల అధికారులతో వరుస సమావేశాలను నిర్వహిస్తోంది. గ్రూప్ IV రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి సుమారు 30 విభాగాలతో TSPSC చైర్మన్ డాక్టర్ బి జనార్దన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్ సోమవారం సమావేశమయ్యారు.

“గ్రూప్ II, III మరియు IV సేవల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన రోస్టర్ పాయింట్లు, ఇండెంట్‌లు, రిజర్వేషన్ మొదలైనవి సుదీర్ఘంగా చర్చించబడతాయి. మొత్తం మీద మూడు నాలుగు రోజుల్లో 94 శాఖలతో సమావేశాలు నిర్వహించనున్నారు. గ్రూప్ II, III, IV కోసం నోటిఫికేషన్‌లు డిసెంబర్‌లో జారీ చేస్తాం ”అని ఆ వర్గాలు తెలిపాయి.

ఇప్పటివరకు, రిక్రూట్‌మెంట్ కోసం ప్రకటించిన 80,039 ఖాళీలలో, 61,804 ఖాళీలకు రిక్రూట్‌మెంట్ కోసం ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. మిగిలిన 18,235 ఖాళీలకు కూడా త్వరలో క్లియరెన్స్ లభించనుంది.

మొత్తం 1,032 ఖాళీల కోసం రిక్రూట్‌మెంట్ నిర్వహించబడిన చివరి గ్రూప్-II నోటిఫికేషన్ 2015లో జారీ అయింది. అలాగే, 1,521 ఖాళీలను గతంలో గ్రూప్-IV కింద నియమించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles