33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

మునుగోడుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం… 1544 కోట్లతో నల్గొండ జిల్లా అభివృద్ధి!

నల్గొండ: మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని, నల్గొండ జిల్లాను అభివృద్ధి చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం అని  పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.  మునుగోడు విజయం తర్వాత తొలిసారిగా ఆ నియోజకవర్గంతోపాటు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రుల బృందం అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించింది.  జిల్లాలో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ రూ.1,544 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రకటించారు.

రాబోయే ఆరేడు నెలల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో రూ.1544కోట్ల నిధుల్ని 12 నియోజకవర్గాల్లో ఖర్చు చేయబోతున్నట్లు ప్రకటించారు మంత్రులు. నల్గొండ బిడ్డల రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మునుగోడుని, నల్గొండను గుండెల్లో పెట్టుకుంటానని సీఎం కేసీఆర్‌ ఆనాడే చెప్పారని, ఆ హామీ నేడు అమలు చేస్తున్నామని అన్నారు మంత్రి కేటీఆర్.

సమీక్షా సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించడంతో 1958 తర్వాత తొలిసారిగా నల్గొండలోని మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీ విజయం సాధించిందన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి శ్రీకారం చుట్టిందని ఆయన తెలిపారు.

రోడ్లు, భవనాల ద్వారా రూ.402 కోట్లు, పంచాయతీరాజ్‌ ద్వారా రూ.700 కోట్లు, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం ద్వారా రూ.334 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రూ.64 కోట్లు సహా రూ.1,544 కోట్ల విలువైన పనులను వివిధ అభివృద్ధి పనులకు వెచ్చించనున్నట్లు తెలిపారు. తదుపరి ఆరు-ఏడు నెలల్లో పూర్వపు జిల్లా. గత ఎనిమిదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నల్గొండలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల అభివృద్ధికి రూ.454 కోట్లు ఖర్చు చేసింది.

మునుగోడు నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి, దండుమల్కాపూర్‌ లో టాయ్‌ పార్క్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు మంత్రి కేటీఆర్‌. ఆర్ అండ్ బి డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో మునుగోడులో రూ.100కోట్లతో రహదారుల విస్తరణ చేపడతామన్నారు. పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో రూ.170కోట్లు , మున్సిపల్‌ శాఖ నేతృత్వంలో చండూరు మున్సిపాలిటీకి రూ.30కోట్లు, చౌటుప్పల్‌ కు రూ.80కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. గిరిజన ఆవాస ప్రాంతాల్లో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రూ.25కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడతామని, రూ.8కోట్లతో 5 సబ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. చండూరుని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొత్తగా 4 హ్యాండ్‌ లూమ్‌ క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles