24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

పుస్తకాల పండుగ వచ్చేసింది…. హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ ప్రారంభం!

హైదరాబాద్: చిరిగినా చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో అనేది నానుడి.  పుస్తకం మంచి మిత్రునితో సమానమని పుస్తక ప్రియులు చెబుతుంటారు. అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు నడిపించే అద్భుత రథ సారథులు పుస్తకాలు. ఇళ్లలో మనం సమకూర్చుకునే వస్తు ప్రపంచం కంటే… పుస్తక ప్రపంచం మేలైనది. పుస్తకాలు మన జ్ఞాన కవాటాలను తెరుస్తాయి.  మూఢవిశ్వాసాలపై చైతన్యాన్ని కలిగిస్తాయి. పుస్తకాలు నిన్ను పెట్రోలు కొట్టించమనవు. ఫుడ్డు ఆర్డర్‌ పెట్టమనవు.  అవి కోరేదల్లా తెరిచి చదవమనే! అలాంటి పుస్తకాల పండుగ హైదరాబాద్‌లో ఆరంభమైంది.

ఆసక్తిగా ఎదురుచూస్తున్న 35వ జాతీయ హైదరాబాద్ బుక్ ఫెయిర్ గురువారం ప్రారంభమైంది. పుస్తక ప్రదర్శనలో ప్రదర్శించిన వివిధ పుస్తకాలను తిలకిస్తూ నగర నలుమూలల నుండి వచ్చిన పుస్తక ప్రియులు ఉత్సాహంతో సందడి చేశారు. ఈసారి బుక్‌ ఎగ్జిబిషన్‌లో మొత్తం 300 స్టాళ్లు ఏర్పాటయ్యాయి. ఈ ప్రదర్శనలో మొత్తం 10లక్షల పుస్తకాలు కొలువుదీరాయి.

ఈ సంవత్సరం పుస్తక ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. మొదటిసారిగా రచయితల మందిరం ఏర్పాటు చేశారు. ఇక్కడ సాహిత్య సమూహాలు పాఠకులతో ఒకరితో ఒకరు సంభాషించడానికి వారి స్వంత పుస్తకాలను ఏర్పాటు చేశారు. అంతేకాదు మహిళా భద్రతా విభాగం డిఐజి సుమతిచే ‘అక్షరయన్’ అనే ప్రత్యేక స్టాల్‌ను ప్రారంభించారు. ఇందులో సుమారు 1000 మహిళా రచయితల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి.

హైదరాబాద్‌ నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కే. చంద్రమోహన్‌ మాట్లాడుతూ.. ‘‘మొట్టమొదటిసారిగా వివిధ కేంద్ర ప్రచురణ సంస్థలు తమ పుస్తకాలను ప్రదర్శించడంతోపాటు ముఖ్యమంత్రులపై వివిధ రచయితలు రాసిన పుస్తకాలను అందించే మన ముఖ్యమంత్రి స్టాల్‌ పేరుతో బుక్‌స్టాల్‌ను ఏర్పాటు చేశామని, మంచి స్పందన వచ్చిందన్నారు. మొదటి రోజు నుంచి జనవరి 1 వరకు సుమారు 10 లక్షల మంది ‘బుక్ ఎగ్జిబిషన్’ను సందర్శిస్తారని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.

  • “ప్రస్తుతం కోవిడ్ కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని, ప్రజలు మాస్క్‌లు ధరించాలని, హ్యాండ్ శానిటైజర్‌లను ఉపయోగించాలని నిర్వాహకులు సూచించారు.
  • బుక్ ఫెయిర్ యొక్క సమయాలు సోమవారం-శుక్రవారం మధ్యాహ్నం 2.30 నుండి రాత్రి 8.30 వరకు
  • వారాంతాల్లో (శని, ఆది) మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకుఅని బుక్ ఫెయిర్ సభ్యుడు అన్నారు.

ఈ సందర్భంగా  జాజ్ గ్యాంగ్ సిరీస్ యొక్క మూడు పుస్తకాల రచయిత వైష్ణవ్ మాట్లాడుతూ… “ఈ బుక్ ఫెయిర్ నా రచనలను  నా ఆలోచనలను ప్రదర్శించడానికి నాకు గొప్ప వేదికను ఇచ్చింది. నా పుస్తకాలు టైమ్ మెషీన్‌ను కనుగొన్న ముగ్గురు యువకులకు సంబంధించినవి. మన పూర్వీకుల గురించి, వారి జీవన విధానం గురించి, సీత దేవి గురించి ప్రజలు మరింత తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నా అని ఆయన అన్నారు.

రచయిత 30 ఏళ్ల రవీంద్ర మాట్లాడుతూ.. ‘‘పుస్తకాల ద్వారా తెలిసినంతగా… ఇంటర్నెట్‌లో సరైన సమాచారం ఎప్పుడూ దొరకదు కాబట్టి వాస్తవికతను అన్వేషించడానికి, జ్ఞానాన్ని పొందేందుకు పుస్తకాలు ఉత్తమ మార్గం. అయితే, దురదృష్టవశాత్తు  సాంకేతికత వినియోగం పెరగడం వల్ల చదివే అలవాటు క్రమంగా కనుమరుగవుతోంది. నా పుస్తకం ప్రత్యేకించి పోటీ పరీక్షలకు సంబంధించినది, ఎందుకంటే ఈ పుస్తకంలో తెలంగాణ గురించి పూర్తి సమాచారం ఉంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles