23.7 C
Hyderabad
Monday, September 30, 2024

‘సెస్’ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని తిరస్కరించారు… మంత్రి కేటీఆర్!

హైదరాబాద్‌: రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన సెస్‌ ఎన్నికల్లో గెలుపొందేందుకు బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు పూర్తిగా తిరస్కరించారని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అన్నారు.

“13 మండలాలు, 2 మునిసిపాలిటీలలో జరిగిన సెస్ ఎన్నికలలో బీఆర్ఎస్ (BRS) పార్టీ అభ్యర్థులకు  అద్భుతమైన విజయాన్ని అందించినందుకు నా జిల్లా రాజన్న సిరిసిల్ల ఓటర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంపై నమ్మకాన్ని మళ్లీ నెలకొల్పినందుకు ధన్యవాదాలు’ అని కే.టీ. రామారావు ట్వీట్ చేశారు.

సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే సెస్ ఎన్నికల్లోనూ విజయం సాధించేందుకు బీజేపీ అన్ని రకాల వ్యూహాలు పన్నింది. కానీ ప్రజలు బీఆర్‌ఎస్‌పై విశ్వాసం ఉంచారని, తమ ఓటుతో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని ఆయన సోమవారం ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

భారతీయ జనతా పార్టీ విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ రంగాన్ని సంపూర్ణంగా ప్రవేటీకరించి, కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే కుట్రలకు ఇది ఒక గుణపాఠంగా మారుతుందని తాను భావిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. సెస్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వ్యవసాయ బావుల పంపుసెట్లకు మీటర్లు వేస్తారని, ఉచిత కరెంటు రద్దు చేస్తారని, రాయితీ కరెంటు ఉండదని ప్రజలు అనుకున్నారని అన్నారు.

విద్యుత్ పంపిణీ సంస్థ సెస్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మోటార్లకి మీటర్లు వస్తాయని, ఉచిత విద్యుత్తు రద్దు అవుతుందని, సబ్సిడీ విద్యుత్తు సౌకర్యం ఉండదని ప్రజలు భావించారన్నారు. అందుకే బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించారని కేటీఆర్ అన్నారు.  బీజేపీ భారీ తేడాతో ఓడిపోవడం చూస్తుంటే… తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో కూడా బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత, తిరస్కరణ ఉందనడానికి బీజేపీ ఎదురైన ఓటమి నిదర్శనం’’ అని రామారావు అన్నారు.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంపై తెలంగాణ ప్రజలకు ఉన్న అపూర్వ విశ్వాసాన్ని బీఆర్‌ఎస్ పార్టీ విజయం మరింత ప్రతిబింబిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం వివిధ వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలకు ప్రజల ఆమోదం ఈ విజయం అని మంత్రి కేటీఆర్ అన్నారు.

‘‘ఈ విజయంతో బీఆర్‌ఎస్ పార్టీపై, రాష్ట్ర ప్రభుత్వంపై బాధ్యత పెరిగింది. మేము నిరుత్సాహపడము మరియు నాణ్యమైన విద్యుత్ సరఫరా మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై మరింత దృష్టి పెడతాము” అని కేటీఆర్ తెలిపారు.

 

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles