23.7 C
Hyderabad
Monday, September 30, 2024

రాష్ట్ర ప్రభుత్వ టీచర్లకు 20వేల టాబ్లెట్ పీసీలు!

హైదరాబాద్: టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల ఉపాధ్యాయులకు త్వరలో డిజిటల్ కంటెంట్‌ను అందించడం, టాబ్లెట్ పీసీలలో వారి హాజరు నమోదు సహా విద్యార్థుల ప్రతిభను సైతం వీటిలో పొందుపరుస్తారు. ఇందులో భాగంగా ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలల ఉపాధ్యాయులకు 20,000 టాబ్లెట్ పీసీలను సరఫరా చేయాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్‌కు టెండర్ నోటీసును జారీ చేసింది

మన ఊరు-మన బడి/మన బస్తీ-మన బడి కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నప్పటికీ, ఈ టాబ్లెట్ పీసీల సరఫరా పాఠశాలల్లో డిజిటల్ విద్యను మరింత పెంచనుంది. ఈ గాడ్జెట్‌లు SIM, Wi-Fi, volte తో అంతర్నిర్మితంగా వస్తాయి.   కాబట్టి, ఇంటర్నెట్ ద్వారా ఉపాధ్యాయులు స్టేట్ బోర్డ్ పాఠ్యపుస్తకాల్లో ముద్రించిన  కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా డిజిటల్ కంటెంట్‌ను యాక్సెస్ చేయనున్నారు.

డిజిటల్‌ విద్యకు సర్కారు బడుల్లో అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవలే ప్రారంభించిన ‘తొలిమెట్టు‘ కార్యక్రమంలోనూ విద్యార్థుల సామర్థ్యాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. ఇందుకోసం స్టూడెంట్‌ ట్రాకర్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్‌లోనే విద్యార్థుల ప్రగతి నమోదుకు ప్రస్తుతం టీచర్ల వ్యక్తిగత సెల్‌ఫోన్లను వాడుతున్నారు. తాజాగా అందించే ఈ ట్యాబ్లెట్‌ పీసీల్లో విద్యార్థుల ప్రగతిని నమోదు చేస్తారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిపెడతారు.

ప్రయోజనాలు..

  • బోధనాసభ్యనలో ట్యాబ్లెట్‌ పీసీని విరివిగా వినియోగిస్తారు.
  • ఎస్సీఈఆర్టీ రూపొందించిన క్యూఆర్‌కోడ్‌ పుస్తకాలను స్కాన్‌ చేసి పాఠ్యాంశాల అదనపు సమాచారాన్ని విద్యార్థులకు అందజేస్తారు.
  • టీసాట్‌, స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ రూపొందించిన డిజిటల్‌ పాఠ్యాంశాలను విద్యార్థులు వినేలా ప్రోత్సహిస్తారు.
  • ఎన్సీఈఆర్టీ-దిశ పోర్టల్లో టీచర్ల కోసం రూపొందించిన మాడ్యూల్స్‌ పూర్తికి దోహదపడుతుంది.
  • ఉపాధ్యాయుల శిక్షణ, ఆన్‌లైన్‌ వర్క్‌షాప్‌లు, వెబినార్లకు హాజరవడానికి టాబ్లెట్‌ పీసీని ఉపయోగిస్తారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles