23.7 C
Hyderabad
Monday, September 30, 2024

విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద గాలిపటాలు ఎగురవేయవద్దు…టి.ఎస్.ఎస్.పి.డి.సి.ఎల్ అభ్యర్థన!

హైదరాబాద్: జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి రోజున పతంగులు ఎగురవేసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,  విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్‌లకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లో గాలిపటాలు ఎగురవేయాలని విద్యుత్‌ సరఫరా అధికారులు ప్రజల్ని కోరారు.

విద్యుత్ షాక్‌తో మరణానికి కారణమయ్యే లోహపు పూతతో కూడిన దారాలను ఉపయోగించవద్దని శుక్రవారం విద్యుత్ బోర్డు  చైర్మన్, ఎండి జి రఘురామ్ రెడ్డి ఒక ప్రకటనలో ప్రజలను కోరారు. విద్యుత్తు తీగలపై పడిన పతంగులను, సబ్‌స్టేషన్‌ ఆవరణలో పడిన గాలిపటాలను ముట్టుకోవద్ని ఆయన ప్రజలను అభ్యర్థించారు. “వాటిన అక్కడ వదిలేయండి. గాలిపటంలో  ఏ భాగాన్ని ముట్టుకోవద్దు, అందరి వాటిికి  దూరంగా ఉండండి, ”అని విద్యుత్ బోర్దు అధికారి చెప్పారు.

పతంగులు ఎగురవేసేటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను ఓ కంట కనిపెట్టాలని విద్యుత్ బోర్డు  చైర్మన్ కోరారు. “పతంగు తెగి   కండక్టర్‌ను తాకినపుడు పిల్లలను ముట్టుకోడానికి అనుమతించవద్దు” అని ఆయన సలహా ఇచ్చారు.

ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో గాలిపటం లేదా ఏదైనా వస్తువులు విద్యుత్ లైన్లపై పడిపోతే వెంటనే 1912కు సమాచారమివ్వండి లేదా సమీపంలోని విద్యుత్ కార్యాలయానికి ఫోన్ చేయండి, లేదా మొబైల్ యాప్ లేదా కంపెనీ వెబ్‌సైట్ ద్వారా విద్యుత్ శాఖకు తెలియజేయాలని ఆయన ప్రజలను కోరారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles