23.7 C
Hyderabad
Monday, September 30, 2024

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2.73% డీఏ పెంపు!

హైదరాబాద్: ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కరవుభత్యం (డీఏ/డీఆర్) 2.73 శాతం పెంచింది.  ఇప్పటిదాకా కరవుభత్యం 17.29 శాతం ఉండగా, తాజా పెంపుతో 20.02 శాతానికి చేరింది.   జనవరి నెల నుంచి పెరిగిన డిఏను జీతం, పెన్షన్లతో కలిపి అంద చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కరవు భత్యం పెంపుతో 4.40 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2.88 లక్షల మంది పింఛనుదారులు లబ్దిపొందనున్నారు. జూలై 1, 2021 నుండి డిసెంబర్ 31, 2022 వరకు సవరించిన డీఏ  బకాయిలు సంబంధిత ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ చేయనున్నారు. అయితే మే 31లోగా పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు మాత్రం డీఏ బకాయిలు నేరుగా  చెల్లిస్తారు.

అదేవిధంగా, పింఛనుదారులకు సవరించిన డీఏ జనవరి వారి పెన్షన్‌తో పాటు ఫిబ్రవరిలో చెల్లిస్తారు. జూలై 1, 2021 నుండి డిసెంబర్ 31, 2022 వరకు DA బకాయిలు ఫిబ్రవరి నుండి ప్రారంభమయ్యే ఎనిమిది సమానమైన నెలవారీ వాయిదాలలో చెల్లించబడతాయి, మార్చి నెలలో చెల్లించనున్నారు.

2010 సవరించిన పే స్కేల్స్ ప్రకారం  పూర్తి-సమయం/కంటిజెంట్ ఉద్యోగుల DAను కూడా రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. తద్వారా జూలై 1, 2021 నుండి పార్ట్-టైమ్ అసిస్టెంట్లు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (VRA) లబ్ధి పొందనున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపుపై తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. టీజీవో, టీఎన్జీవో, పిఆర్‌టియూ అధ్యక్షులు  ముఖ్యమంత్రి కేసీఆర్‌కు  కృతజ్ఞతలు తెలిపారు.

డిఏ పెంపు.. ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles