33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

‘బస్‌ ట్రాకింగ్ యాప్‌’ను ప్రవేశపెట్టిన టీఎస్‌ఆర్‌టీసీ!

హైదరాబాద్:  ప్రయాణికులకు టీఎస్‌ఆర్‌టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. బస్ ట్రాకింగ్ యాప్‌ను కొత్తగా అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ సహాయంతో మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడ ఉంది..? ఎంతసేపటికి మీరు బస్సు ఎక్కాల్సిన ప్రాంతానికి రానుంది? అనే వివరాలను సలువుగా తెలుసుకోవచ్చు. ఒకే ఒక్క క్లిక్‌తో ఈ యాప్ ద్వారా మీ బస్సు ఎక్కడ ఉందో ఇట్టే తెలుసుకోవచ్చని టీఎస్‌ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

TSRTC Bus Tracking’ పేరుతో ఈ యాప్‌ను టీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి నేరుగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా www.tsrtc.telangana.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి అయినా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎక్కాల్సిన బస్ సర్వీస్ నెంబర్ లేదా వెహికల్ నెంబర్ లేదా బస్టాఫ్ వివరాలను ఎంటర్ చేసి మీ బస్సు లొకేషన్‌ను తెలుసుకోవచ్చు. యాప్‌లో ప్రయాణికుల పర్సనల్ వివరాలు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని టీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ఇప్పటికే హైదరాబాద్ నగరం అంతటా ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ట్రాకింగ్ సిస్టమ్ అమలు చేస్తున్నారు. రాబోయే నెలల్లో  తెలంగాణ అంతటా అన్ని బస్సులలో టీఎస్‌ఆర్‌టీసీ ఈ వ్యవస్థను ప్రవేశపెట్టనుంది.

పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంలో మొదట్లో సుమారు 1,800 బస్సుల్లో ట్రాకింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ వ్యవస్థను 4,000 బస్సులకు విస్తరించనున్నారు. అలాగే ఈ యాప్ ద్వారా రోడ్డు ప్రమాదం, వైద్య సహాయం, బస్సు బ్రేక్ డౌన్ వంటి వివరాలను అధికారులకు తెలుపవచ్చు. దీని ద్వారా అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటారని ఎండీ వి.సి.సజ్జన్నార్ తెలిపారు.

ుఉదాహరణకు ‘కూకట్‌పల్లిలో ఉండే సంతోష్.. సత్తుపల్లికి వెళ్లేందుకు బస్‌ బుక్‌ చేసుకున్నాడు. తాను వెళ్లాల్సిన బస్సు బీహెచ్‌ఈఎల్‌ నుంచి మొదలవుతుంది. అయితే ఆ బస్సు కూకట్‌పల్లి బస్‌ స్టాప్‌కు ఏ సమయానికి చేరుకుంటుందో తెలియక గంట ముందే వచ్చి నిల్చున్నాడు. దీంతో బస్సు కాస్త గంటన్నర ఆలస్యంగా రావడంతో అంతసేపు ఎదురు చూడాల్సి వచ్చింది’. సంతోష్ ఎదుర్కొన్న సమస్య మీలో చాలా మందికి అనుభంలో ఉండే ఉంటుంది. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికే టీఎస్‌ఆర్టీసీ బస్ ట్రాకింగ్ సిస్టమ్ పేరిట సరికొత్త యాప్ తీసుకొచ్చింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles