28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం… కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్!

హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. గతంతో పోలిస్తే తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు చాలా మేరకు తగ్గాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ శుక్రవారం పార్లమెంట్‌లో స్పష్టం చేశారు.

ఎంపీ నారాయణ్‌దాస్‌ గుప్తా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (NCRB) నివేదిక ప్రకారం తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు భారీగా తగ్గినట్టు వెల్లడించారు. 2017లో 846 మంది, 2018లో 900 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఈ సంఖ్య 2019లో 491కి, 2020లో 466కు, 2021లో 352కు తగ్గినట్టు వివరించారు.

రాష్ట్రంలో  రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రకటనపై వ్యవసాయశాఖ మంత్రి ఎస్‌ నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ.. రైతుల ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న వదంతులు, తప్పుడు ఆరోపణలను ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా బీజేపీ ఆపాలని ఆకాంక్షించారు.

నిజానికి తెలంగాణ కంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రత్యేకించి బీజేపీ పాలిత మహారాష్ట్ర రైతుల ఆత్మహత్యల విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో 2020లో 2,567 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2021లో ఈ సంఖ్య 2,640కు పెరిగింది. ఈ జాబితాలో కర్ణాటక రెండో స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో 2020లో 1,072 మంది, 2021లో 1,170 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలే రైతు ఆత్మహత్యలు తగ్గడానికి ప్రధాన కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో రైతుబంధును అమలు చేయడంతోపాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, సమృద్ధిగా సాగునీరు అందిస్తుండటంతో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గినట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles