31 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఫిబ్రవరి 23న ‘హైదరాబాద్‘లో మెగా జాబ్ మేళా…పోస్టర్ విడుదల!

హైదరాబాద్: ఫిబ్రవరి 23న మాసాబ్ ట్యాంక్‌లోని ఖాజా మాన్షన్‌లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు  ‘మెగా జాబ్ మేళా’ జరుగనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను హోంమంత్రి మహమ్మద్‌ అలీ, ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు ఆదివారం ఆవిష్కరించారు.

ఈ జాబ్ మేళా  కుల మతాలకు అతీతంగా జరుగనుంది. కావున నిరుద్యోగ యువత దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. మెగా జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థుల కనీస అర్హత SSC ఆపైన ఉండాలి. ప్రాథమిక ఇంటర్వ్యూలను అదే వేదిక వద్ద నిర్వహించనున్నారు. ప్రతి ఒక్కరూ తమ నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం ఉంటుంది.

నగరానికి చెందిన డక్కన్ బ్లాస్టర్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తోంది. ఇది నిరుద్యోగ యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది, ఎందుకంటే SSC కనీస విద్యార్హతతో 1,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు లభించనున్నాయి. అనుభవం ఉన్న లేదా లేకపోయినా సరే డిగ్రీ పట్టా అందుకున్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మేళాకు iStaff గ్లోబల్ సొల్యూషన్స్ మద్దతు ఇస్తుంది. ఆసక్తిగల వివరాల కోసం 83743-15052 నంబర్‌లో సంప్రదించవచ్చు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles