30.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

రాష్ట్రంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్ @దుండిగల్ !

హైదరాబాద్‌ :  రాష్ట్రంలో ఉత్తమ పోలీస్‌స్టేషన్‌గా దుండిగల్‌ ఠాణా నిలిచింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో తొలిస్థానం దక్కింది. 2022 సంవత్సరానికి గాను తెలంగాణలో అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా దుండిగల్‌  నిలిచింది. రాష్ట్రంలో దుండిగల్‌ ఠాణా తొలిస్థానంలో నిలవడంపై డీజీపీ అంజనీకుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎక్సలెన్స్ సర్టిఫికెట్ ఇతర పోలీసు స్టేషన్‌లకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఠాణా ఇన్‌స్పెక్టర్‌ సిబ్బందిని అభినందించి, సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా పోలీస్‌స్టేషన్ల వార్షిక ర్యాకింగ్స్‌ను విడుదల చేస్తుంటుంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles