24.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఫిబ్రవరి 27 నుండి గ్రూప్-II ప్రిలిమ్స్ ఆన్‌లైన్ కోచింగ్ తరగతులు!

హైదరాబాద్: రాష్ట్రంలో మొత్తం 783 గ్రూప్-2 ఖాళీల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గత డిసెంబర్ 29న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రూప్-2 కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC) శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి 27 నుండి తెలంగాణ గ్రూప్-II ప్రిలిమ్స్ ఆన్‌లైన్ కోచింగ్ తరగతులు ప్రారంభిస్తున్నట్లు తెలియజేసింది.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-II (ప్రిలిమ్స్) ఎగ్జామినేషన్ సోషల్ స్ట్రక్చర్, పబ్లిక్ పాలసీల సమస్యలు, డెవలప్‌మెంట్ అండ్ ఛేంజ్, సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ కు సంబంధించి  లైవ్ టెలికాస్ట్ ఆన్‌లైన్ కోచింగ్ క్లాసులు ఫిబ్రవరి 27 నుండి జై తెలంగాణ టీవీ INB న్యూస్, హైదరాబాద్ ద్వారా ప్రారంభం కానున్నాయి. రెండు నెలల పాటు. కోచింగ్ తరగతులు ఉంటాయి. ప్రత్యక్ష ప్రసార సమయాలు రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అంటే గంటన్నర పాటు ఉంటుందని టీఎస్‌బీసీ స్టడీ సర్కిల్స్ డైరెక్టర్ తెలిపారు.

TSPSC గ్రూప్ II పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులందరూ జై తెలంగాణ టీవీ INB న్యూస్ హైదరాబాద్‌లో చూడవలసిందిగా సంబంధిత అధికారులు అభ్యర్థించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles