23.7 C
Hyderabad
Monday, September 30, 2024

డిగ్రీలో ‘సైబర్‌ సెక్యూరిటీ’ కోర్సు…ఉన్నత విద్యామండలి నిర్ణయం!

హైదరాబాద్: ప్రపంచానికి సవాల్ విసురుతున్నసైబర్ క్రైమ్‌లు రాన్రాను పెరుగుతున్నాయి. ఆన్ లైన్ మోసాలు ఎక్కువయ్యాయి. ఆయా విషయాల్లో కనీస అవగాహన లేక ఎంతో మంది బలైపోతున్నారు.  ఈ నేపథ్యంలో   డిగ్రీలో సైబర్‌ సెక్యూరిటీ కోర్సును ప్రవేశ పెట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ కోర్సును అమల్లోకి తీసుకురానుంది. దీంతో రాష్ట్ర విశ్వవిద్యాలయాలు  సైబర్ నేరాలను పరిష్కరించడానికి సైబర్ యోధులను సిద్ధం చేస్తాయి.

నల్సార్ వర్శిటీ, ఉస్మానియా వర్సిటీ విషయ నిపుణులచే ఈ కోర్సును రూపొందించినట్టు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన వీసీల సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రాబోయే కొత్త విద్యాసంవత్సరంలోనే సైబర్‌ సెక్యూరిటీతో పాటు బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ మేజర్‌ సబ్జెక్టుగా, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌లర్నింగ్‌ను మైనర్‌ సబ్జెక్టులుగా నిర్వహించేలా ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ప్రైవేట్‌ అనుబంధ కాలేజీలకు కోర్సులవారీగా కాకుండా జెనరిక్‌ అఫిలియేషన్‌ మంజూర చేయనున్నారు.

అభివృద్ధి చేయబడిన ఈ కొత్త కోర్సును ఏ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి అయినా వారి కోర్సులతో సంబంధం లేకుండా ఎంచుకోవచ్చు. డిగ్రీ కళాశాలల్లో BSc లేదా BA కోర్సులను అభ్యసించే విద్యార్థులు కూడా ఈ కొత్త ఎంపికను తీసుకోవచ్చు, దీనికి రెండు క్రెడిట్లు ఉంటాయి. అంతేకాదు ఈ కొత్త కోర్సు సైబర్‌క్రైమ్‌లపై అవగాహన కల్పించడమే కాకుండా, కొత్త సైబర్ సెక్యూరిటీ కోర్సు విద్యార్థులకు ఉపాధి అవకాశాలను అందించడంలో సహాయపడుతుంది” అని ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles