24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

పేదల పొట్టకొట్టి అదానీకి కట్టబెడుతున్నారు…కాంగ్రెస్ పార్టీ!

మహబూబ్‌నగర్‌: అదానీ గ్రూప్‌ కంపెనీల్లో ఆర్థిక అవకతవకలపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ మహబూబ్‌నగర్‌కు చెందిన కాంగ్రెస్‌ సభ్యులు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఎదుట శుక్రవారం నిరసన చేపట్టారు. లక్షల కోట్ల నష్టం కలిగించిన గౌతమ్‌ అదానీ ఆర్థిక అవకతవకలపై జేపీసీ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు జి. మధుసూధన్‌రెడ్డి, ఇతర సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి ఎస్‌బీఐ బ్యాంక్‌ దగ్గర రోడ్డుపై బైఠాయించారు.

ఈ సందర్భంగా మధుసూధన్‌ రెడ్డి మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజల సంపదను లూటీ చేస్తూ తన మిత్రుడు అదానీకి అనుకూలంగా వ్యవహరిస్తూ పేదలకు, అణగారిన వర్గాలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం పేద, సామాన్య ప్రజలను దోచుకుని అదానీకి కట్టబెడుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఎల్‌ఐసీ, ఎయిర్‌పోర్టులు, బొగ్గు కంపెనీలతోపాటు లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రభుత్వం అదానీకి విక్రయించింది. అదానీ గ్రూపుపై.. హిండెన్‌బర్గ్ వంటి అంతర్జాతీయ పరిశీలకుల నుండి ఆరోపణలు చేసినప్పటికీ, మోడీ ప్రభుత్వం ఆ ఆరోపణలపై ఎలాంటి వివరణలు ఇవ్వకుండా మౌనం వహిస్తోంది” అని ఆయ విమర్శించారు.

అదానీ గ్రూప్ కంపెనీల అక్రమాలపై విచారణకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మరియు సెబిని ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలలో అవకతవకలు ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద కార్పొరేట్ కుంభకోణం అని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఆరోపించారు.

అదానీ గ్రూపు కంపెనీల్లో మారిషస్‌ నుంచి వచ్చిన 6.9 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 56 వేల కోట్లు) పెట్టుబడులపై సెబీ ఎందుకు దర్యాప్తు చేయడం లేదని, విచారణకు సెబీ ఎందుకు భయపడుతోందని, సెబీని ఎవరు ఆపుతున్నారని కాంగ్రెస్‌ నేత ప్రశ్నించారు.  షెల్ కంపెనీలు (నకిలీ కంపెనీలు) (ఎలారా ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్, క్రెస్టా ఫండ్, అల్బులా ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్, APMS ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్) మారిషస్‌లో కేంద్రీకృతమై ఉన్నాయని ఆయన అన్నారు.

కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్‌ ముదిరాజ్‌, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు రాములు యాదవ్‌, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు సాయిబాబా, జిల్లా కాంగ్రెస్‌ కార్యదర్శి సిరాజ్‌ ఖాద్రీ, జిల్లా కాంగ్రెస్‌ ప్రచార కార్యదర్శి బెనహర్‌, టీపీసీసీ మైనార్టీ కార్యదర్శి పీర్‌ మహ్మద్‌, మహబూబ్‌నగర్‌ టౌన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు లక్ష్మణ్‌ యాదవ్‌, నిరసనలో జిల్లా అధ్యక్షుడు అవేజ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles