33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

డబుల్‌ ఇంజినా.. ట్రబుల్‌ ఇంజినా?… ‘గుజరాత్‘లో కరెంట్ కోతలపై మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా

హైదరాబాద్: గుజరాత్ ప్రభుత్వం తన పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించడంతో గుజరాత్ మోడల్ గ్రోత్….  తరచుగా పేర్కొనే డబుల్ ఇంజన్ గ్రోత్ వెనుక ఉన్న డొల్లతనం బట్టబయలైంది.

ఇటీవల ఐదు రాష్ర్టాల ఎన్నికలప్పుడు డబుల్‌ ఇంజిన్‌ గ్రోత్‌ అంటూ కమలనాథులు కొత్త పాట మొదలుపెట్టారు. కేంద్రంలో.. రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి సూపర్‌గా జరిగిపోతుందని చెప్పుకొంటూ వచ్చారు. మరి మోదీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లయింది. గుజరాత్‌లోనూ తన పార్టీయే అధికారంలో ఉన్నది. కానీ.. కరెంటు కోసం ఐదు రోజులుగా ఆ రాష్ట్ర రైతులు మండుటెండల్లో రోడ్లమీదకు వచ్చి హాహాకారాలు చేస్తున్నారు. పులిమీద పుట్రలా గుజరాత్‌ ఊర్జా వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (జీయూవీఎన్‌ఎల్‌) అక్కడి పరిశ్రమలకు వారానికి ఒకరోజు పవర్‌ హాలిడే ప్రకటించింది. సంస్థ టెక్నికల్‌ డైరెక్టర్‌ హెచ్‌పీ కొఠారీ రాష్ట్రంలోని నాలుగు డిస్కంలు, ట్రాన్స్‌మిషన్‌ సంస్థల ఎండీలకు మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.

ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని, దీనిని క్షేత్రస్థాయిలో అమలుచేసేలా అధికారులను ఆదేశించాలని, సంబంధిత పరిశ్రమలకు కూడా దీనిని తెలియజేస్తూ.. కచ్చితంగా ఒకరోజు పవర్‌ హాలిడే పాటించేలా చూడాలని స్పష్టంచేశారు.

కాగా,  14,000 మెగావాట్లకు పైగా గరిష్ట విద్యుత్ లోడ్‌తో తెలంగాణ మార్చ్ 29న రికార్డు నమోదు చేసింది. మంగళవారం మధ్యాహ్నం 12.28 గంటలకు రాష్ట్రంలో 14,117 మెగావాట్ల విద్యుత్ లోడ్ నమోదైంది. 14,117 మెగావాట్ల పీక్ లోడ్‌లో, తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) పరిమితుల్లో 8,400 MW కంటే ఎక్కువ నమోదైంది.

అధిక పీక్ లోడ్‌కు కారణం  వినియోగదారులు ఎక్కువ  కరెంట్ ఉపయోగించడం. అంతేకాకుండా, TSSPDCLలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఉన్న కోటి కనెక్షన్లకు ఆరు లక్షల కొత్త కనెక్షన్లు కూడా జత కూడాయి.

మరికొద్ది రోజుల్లో పీక్ లోడ్ 18,000 మెగావాట్లకు చేరుకున్నప్పటికీ మరింత విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్తు వర్గాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

గుజరాత్‌లో పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించడంపై… డబుల్‌ ఇంజినా.. ట్రబుల్‌ ఇంజినా? అని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.
గుజరాత్‌లో పరిశ్రమలకు పవర్‌ హాలిడే ప్రకటించడంపై మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా విమర్శలు సంధించారు. పవర్‌ ఫుల్‌ వ్యక్తులుగా చెప్పుకొనే వారి సొంత రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితా? అని వ్యంగ్యాత్మకంగా ప్రశ్నించారు. ఇది డబుల్‌ ఇంజినా? లేక ట్రబుల్‌ ఇంజినా? అని విమర్శించారు. గుజరాత్‌లో పరిశ్రమలకు పవర్‌ హాలిడేను ప్రకటిస్తూ గుజరాత్‌ ఊర్జా వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ జారీ చేసిన ఉత్తర్వుల కాపీని షేర్‌ చేశారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles