23.7 C
Hyderabad
Monday, September 30, 2024

కేరళలో ‘ఫుడ్ పాయిజన్‘తో ‘హైదరాబాద్‘లో మండి, షావర్మా కేంద్రాలపై నిఘా!

హైదరాబాద్: అరబిక్ మండీ స్టైల్‌లో వండిన ఆహారం, షావర్మాతో కేరళలో ఫుడ్‌పాయిజన్‌తో ఎనిమిది నెలల వ్యవధిలో కేరళలో ముగ్గురు యువకులు మృతి చెందడం… నగరంలో ఆహార భద్రత, ఆహార పరిశుభ్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది.

కేరళలో మండీ ఫుడ్, షావర్మా తిన్న యువకులు ఫుడ్ పాయిజనింగ్‌కు గురై ప్రాణాలు కోల్పోవడంపై స్పందించిన నేషనల్ ఐఎంఏ, కోవిడ్ టాస్క్ ఫోర్స్ కో-ఛైర్మన్, ఐఎంఏ మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ రాజీవ్ జయదేవన్ ఆదివారం ట్విట్టర్ ద్వారా ప్రజలకు అవసరమైన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

స్థానికంగా తయారు చేసే షవర్మాలో ఒక పెద్ద శంఖాకారంలో మాంసాన్ని (కోడి మాంసం) వేరే చోట సమీకరించి డెలివరీ చేసే ప్రదేశానికి తీసుకువస్తారు. ఇది 2-3 అడుగుల పొడవు, 1 అడుగుల వెడల్పు ఉంటుంది, దాని వెనుక ఉన్న ఇండక్షన్ స్టౌ ద్వారా ఆ మాంసాన్ని ఉడికిస్తారు. అయితే లోపల ఉన్న మాంసం పాక్షికంగా ఉడుకుతుందన్న విషయాన్ని వీరు గుర్తించరు. అదే మాంసాన్ని  తీసుకుని, పచ్చి గుడ్లు, వెల్లుల్లి, నూనెతో తయారు చేసిన సలాడ్, మయోతో పాటు ర్యాప్‌గా అందిస్తారని ”డాక్టర్ రాజీవ్ చెప్పారు.

ఉడకని  మాంసం అప్పటికే కలుషితమై, అక్కడి బ్యాక్టీరియా మిగతా భాగాన్ని చేరుతుంది. ఇక  మాంసాన్ని తీసుకువచ్చేటప్పుడు పరిశుభ్రమైన పరిస్థితులలో శుభ్రం చేశారా లేదా అంతకుముందు రోజు మిగిలిన మాంసాన్ని  రాత్రి ‘ఫ్రిజ్‘లో ఉంచారో  కస్టమర్‌కు తెలిసే మార్గం లేదు, అని డాక్టర్ రాజీవ్  హెచ్చరించారు.

మండి, షావర్మా ఇటీవలి కాలంలో ఆహార ప్రియులలో విపరీతమైన ప్రజాదరణ పొందడంతో, వాటిని అందించే అనేక అవుట్‌లెట్‌లు నగరం అంతటా వచ్చాయి.

స్థానిక పరిపాలన, ఆరోగ్య శాఖకు చెందిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు తినుబండారాలపై తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ, ఈ వంటకాలను వారి మెనూలో హైలైట్‌గా కలిగి ఉన్న అవుట్‌లెట్‌లు పెద్ద సంఖ్యలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి, వాటిని నియంత్రించడం కష్టమవుతుంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles