30.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

హైదరాబాద్‌లో వీఎక్స్‌ఐ.. 10 వేల ఉద్యోగాలు కల్పించనున్న దిగ్గజ సంస్థ!

హైదరాబాద్‌: ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన అమెరికా పర్యటనలో భాగంగా రాష్ట్రానికి వేలకోట్ల  పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఐటీ ఎనేబుల్డ్ సేవల రంగంలో తెలంగాణ అద్వితీయ పనితీరు కనబరుస్తోంది.  టెక్నాలజీ రంగంలో వినియోగదారులకు వినూత్న సేవలందించడంలో దిగ్గజ సంస్థగా పేరుగాంచిన బైన్‌ క్యాపిటల్‌కు చెందిన వీఎక్స్‌ఐ గ్లోబల్‌ సొల్యూషన్స్‌ హైదరాబాద్‌లో తమ డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నది. ఇందులో దశలవారీగా 10 వేల మంది నిపుణులకు ఉద్యోగాలు కల్పించనున్నారు.

పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు తన యూఎస్ టూర్ సందర్భంగా VXI గ్లోబల్ సొల్యూషన్స్ గ్లోబల్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (CHRO) ఎరికా బోగర్ కింగ్‌తో సమావేశమయ్యారు. తమ సంస్థకు చెందిన డెలవరీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుచేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. తొమ్మిదేండ్ల స్వల్పకాలంలోనే పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ ఎలా మారిందో ఎరికా బోగర్‌కింగ్‌కు మంత్రి కేటీఆర్‌ వివరించారు.

బెయిన్ క్యాపిటల్ యాజమాన్యంలోని సంస్థ, @vxiglobal, కస్టమర్ సేవలను అందించే ప్రముఖ ప్రొవైడర్. ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా, ఆసియా, యూరప్ మరియు కరేబియన్‌లోని 42 ప్రాంతాల్లో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది.  ఇది 10,000 మంది ఉద్యోగుల కేంద్రాన్ని సెటప్ చేయడానికి హైదరాబాద్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ” అని సమావేశం అనంతరం మంత్రి ట్వీట్ చేశారు.

 వీఎక్స్‌ఐ గ్లోబల్‌ సొల్యూషన్స్‌

వీఎక్స్‌ఐ గ్లోబల్‌ సొల్యూషన్స్‌ను 1998లో స్థాపించారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికా కాలిఫోర్నియాలోని లాస్‌ఏంజెల్స్‌లో ఉన్నది. ఈ సంస్థ ఉత్తర అమెరికా, ఆసియా, యూరప్‌, కరేబియన్‌లోని 42కిపైగా ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. ఇందులో ప్రస్తుతం 40 వేలకుపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంస్థ ప్రపంచంలోని ప్రముఖ బ్రాండ్లకు కస్టమర్‌ కేర్‌, కస్టమర్‌ సొల్యూషన్స్‌ సేవలు అందించటంతోపాటు సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, క్వాలిటీ అష్యూరెన్స్‌, ఆటోమేషన్‌ తదితర విభాగాల్లో సేవలందిస్తున్నది. ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడిదారు బైన్‌ క్యాపిటల్‌ మద్దతుతో ఈ సంస్థ అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రైవేటు సంస్థల్లో ఒకటిగా పేరు సంపాదించింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles