Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

పోచారం ప్రాజెక్టుకు ముప్పు…తీవ్రస్థాయిలో వరద!

హైదరాబాద్‌: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. గంటగంటకు పెరుగుతున్న వరదతో.. పోచారం ప్రాజెక్టుపైనుండి వరదనీరు ప్రవహిస్తోంది. ప్రాజెక్ట్‌ ఓవర్‌హెడ్‌ ప్రాంతంలో భారీ గండిపడినట్లు సమాచారం. దీంతో ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లవచ్చని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ముందు జాగ్రత్తగా దిగువన ఉన్న గ్రామాల ప్రజలను ఖాళీ చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావును ఆదేశించారు. నివేదికల ప్రకారం, రిజర్వాయర్ […]
Read more

తెలంగాణలో యూరియా కొరత…తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు!

హైదరాబాద్: ఖరీఫ్ సీజన్‌లో యూరియా కొరతతో తెలంగాణ సతమతమవుతోంది. ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాల (PACS) వెలుపల రైతులు గంటల తరబడి క్యూలో నిలబడి తమకు తగినంత యూరియా అందడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంపై చాలా మంది ఆగ్రహం, నిరాశ వ్యక్తం చేశారు. ఎరువులు పొందడానికి నిన్నంతా రైతులు గంటల తరబడి క్యూలో ఓపికగా నిలబడి ఉన్నట్లు చూపే దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఒక వీడియోలో, సంగారెడ్డి మండలంలోని ఇస్మాయిల్ ఖాన్‌పేట్ […]
Read more

కాన్సిస్ట్యూషన్‌ క్లబ్‌లో మోదీ వ్యతిరేక స్వరాలపై దాడికి యత్నం!

న్యూఢిల్లీ: ఇది అత్యంత ఆందోళనకర దృశ్యం. దేశ రాజధాని ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో నుండి ఈ దృశ్యాలు బయటకు వచ్చాయి. అసోంలో ముస్లింలను బంగ్లాదేశీలు అని ముద్ర వేయడాన్ని వ్యతిరేకిస్తూ దేశంలోని హిందుత్వ వ్యతిరేక మేధావులు ఏర్పాటు చేసిన సమావేశం జరుగుతుండగా, హిందుత్వవాదుల గుంపు కార్యక్రమం జరుగుతున్న హాల్‌లోకి చొరబడి సమావేశాన్ని అల్లకల్లోలం చేసింది. “జై శ్రీరామ్”, “భారత మాతాకీ జై” అంటూ నినాదాలు చేశారు. మేధావులను టెర్రరిస్టులంటూ శాపనార్థాలు పెట్టారు. అదృష్టవశాత్తూ అక్కడున్న మేధావులు, మహిళలు […]
Read more

జమ్మూ కశ్మీరులో వర్ష బీభత్సం…33 మంది మృతి, 23 మందికి గాయాలు!

శ్రీనగర్: జమ్ము కశ్మీరులో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. జమ్ము కశ్మీరుకు చెందిన త్రికూట పర్వతాలపైన వెలసిన వైష్ణోదేవి అమ్మవారి ఆలయం యాత్రామార్గంలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 33 మంది మృతి చెందగా, 23 మంది గాయపడ్డారు. మరికొంతమంది వ్యక్తులు ఇంకా చిక్కుకుపోవచ్చనే భయాల మధ్య రెస్క్యూ బృందాలు శిథిలాల కింద వీరికోసం వెతుకులాట కొనసాగిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ అంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వరదలు, కొండచరియలు విరిగిపడటానికి కారణమయ్యాయి. జమ్మూలో, కీలకమైన మౌలిక […]
Read more

గాజా ఆసుపత్రిపై ఇజ్రాయెల్ బాంబు దాడి… జర్నలిస్టులు సహా 20 మంది పౌరులు మృతి!

డెయిర్ అల్ బలాహ్: గాజా ఆసుపత్రి సముదాయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో కనీసం 20 మంది మరణించారు, వీరిలో నలుగురు జర్నలిస్టులు, అంబులెన్స్, సివిల్ డిఫెన్స్ సిబ్బంది కూడా ఉన్నారు. పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది. బూడిద, పొగ, శిధిలాలు గాలిలోకి ఎగిసాయి. ప్రజలు కేకలు వేస్తూ, సంఘటన స్థలం నుండి పారిపోతున్న దృశ్యాలు మనకు వీడియోల్లో కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడిలో మరణించిన జర్నలిస్టుల్లో… అబు దకా (అసోసియేటెడ్ ప్రెస్), మొహమ్మద్ సలామా (అల్ జజీరా), హోసం […]
Read more

హైదరాబాద్‌లో తరచూ ఇంటర్నెట్‌కు అంతరాయం!

హైదరాబాద్: గత పక్షం రోజులుగా హైదరాబాద్‌లో తరచూ ఇంటర్నెట్ అంతరాయం ఏర్పడుతుంది. దీనికి కారణం విద్యుత్‌ అధికారులు కేబుల్స్‌ను కట్‌చేయడమేనని అంటున్నారు. విద్యుత్ బోర్డు తెలంగాణ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తోందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI)తెలిపింది. నగరంలో కరెంట్‌ షాక్ మరణాలు సంభవించిన తర్వాత TGSPDCL అధికారులు నగరం అంతటా వైర్లను కత్తిరించడం ప్రారంభించారు. “హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాలలో TGSPDCL సిబ్బంది చట్టవిరుద్ధంగా కేబుల్స్‌ కట్‌ చేయడాన్ని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా […]
Read more

ఆగస్టు 30 నుండి అసెంబ్లీ సమావేశాలు!

హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 30న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నోటిఫికేషన్ జారీ చేశారు. అంతకు ముందు రోజు ఆగస్టు 29న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ క్యాబినెట్ సమావేశానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశమే ముఖ్యమైన ఎజెండాగా ఉండనుంది. కాగా, అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు కొనసాగుతాయని భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం కమీషన్‌ నివేదికపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా […]
Read more

కర్ణాటక కాంగ్రెస్‌లో చీలికకు దారితీసిన డీకే శివకుమార్ ఉదంతం!

బెంగళూరు: ఇటీవల ముగిసిన వర్షాకాల సమావేశాల సందర్భంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ అసెంబ్లీలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) గీతాన్ని ఆలపించడం అధికార కాంగ్రెస్ ఈమేరకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ సోమవారం డిప్యూటీ సీఎం శివకుమార్ తన చర్యకు క్షమాపణ చెప్పాలని కోరారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, డిప్యూటీ సీఎంగా ఆర్‌ఎస్‌ఎస్ గీతాన్ని పాడటానికి ఎటువంటి అభ్యంతరం లేనప్పటికీ, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా […]
Read more

హైదరాబాద్‌లో రేవ్‌ పార్టీని భగ్నం చేసిన పోలీసులు…ఏడుగురి అరెస్ట్‌!

హైదరాబాద్‌: నగరంలోని కొండాపూర్‌లో జరిగిన రేవ్ పార్టీని తెలంగాణ ఈగల్‌ టీమ్‌, నగర పోలీసులు భగ్నం చేశారు. ముగ్గురు వ్యాపారవేత్తలు, ఒక గృహిణి, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఒక ఇంజనీరింగ్ విద్యార్థితో సహా ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. సైబరాబాద్ పోలీసులు, ప్రత్యేక మాదకద్రవ్యాల నిరోధక బృందంతో కలిసి సోమవారం కొండాపూర్‌లోని రాజేశ్వరి నిలయం సర్వీస్ అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి, 20 గ్రాముల కొకైన్, 8 ఎక్స్‌టసీ మాత్రలు (20 గ్రాములు),3 గ్రాముల MDMAతో సహా గణనీయమైన […]
Read more

ప్రధాని మోడీ డిగ్రీని బహిర్గతం చేయాలన్న సీఐసీ ఆదేశాలను కొట్టివేసిన హైకోర్టు!

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్యాచిలర్ డిగ్రీకి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయాలనే CIC ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది, ఆయన ప్రభుత్వ పదవిలో ఉన్నందున, ఆయన ‘వ్యక్తిగత సమాచారం’ ప్రజలకు బహిర్గతం చేయలేమని పేర్కొంది. జస్టిస్ సచిన్ దత్తా కోరిన సమాచారంలో ‘ ప్రజా ప్రయోజనం’ లేదని తోసిపుచ్చారు. ప్రభుత్వ పనితీరులో పారదర్శకతను ప్రోత్సహించడానికి, ‘సంచలనానికి తావుండకూడదని’ RTI చట్టం రూపొందించారని అన్నారు. నీరజ్ అనే వ్యక్తి RTI దరఖాస్తును అనుసరించి, డిసెంబర్ 21, 2016న […]
Read more
1 18 19 20 21 22 95

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.