Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఆర్‌ఎస్‌ఎస్ వివాదం…ప్రభుత్వ ఆస్తుల వినియోగంపై కొత్త బిల్లును తీసుకొస్తున్న కర్ణాటక!

బెంగళూరు: ప్రభుత్వ స్థలాల్లో ప్రైవేటు కార్యకలాపాలను నియంత్రించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఒక బిల్లును తీసుకువస్తోంది. బహిరంగ ప్రదేశాలలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలలు నిర్వహించడంపై రాష్ట్ర హోం మంత్రి ప్రియాంక్ ఖర్గేకు, ఆర్‌ఎస్‌ఎస్‌కు మధ్య కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఈ చర్య తీసుకుంటున్నారు. ఈమేరకు ‘ప్రభుత్వ ప్రాంగణాలు, ప్రభుత్వ ఆస్తుల వినియోగ కర్ణాటక నియంత్రణ బిల్లు, 2026’పై రాష్ట్ర మంత్రివర్గం చర్చించినట్లు వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదిత చట్టం ప్రకారం…ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి నమోదుకాని సంస్థలతో సహా ఏ సంస్థ అయినా […]
Read more

రాజకీయ సంభాషణలో చతురత ప్రదర్శించిన రాహుల్ గాంధీ!

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల ‘రచనాత్మక్ కాంగ్రెస్’ జాతీయ సదస్సులో వ్యంగ్యం, చమత్కారంతో కూడిన రాజకీయ సంభాషణ ద్వారా వినూత్న శైలిని ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ విధానాన్ని, ‘హగ్ డిప్లొమసీ’ని విమర్శిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తద్వార లోక్‌సభ ప్రతిపక్షనేత ఈ సమావేశాన్ని ఒక ఉత్సాహభరితమైన, పరస్పర సంభాషణలతో కూడిన, గాఢమైన రాజకీయ చర్చగా మార్చారు. కాగా, రాహుల్‌ గాంధీ తన ప్రసంగంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై […]
Read more

ఎస్ఐఆర్‌లో లక్షలాది ఓటర్ల పేర్ల తొలగింపుకు కుట్ర జరుగుతోంది… సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్: తెలంగాణలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో తమ పేర్లు తొలగించకుండా చూసుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేసారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్‌లో లక్షలాది ఓటర్ల పేర్లను తొలగించినట్లుగా, తెలంగాణలో కూడా ఓటర్ల పేర్లను తొలగించేందుకు “కొన్ని రాజకీయ శక్తులు” కుట్ర పన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈమేరకు “మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్”లో సీఎం మాట్లాడుతూ… తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్) లో ఓటర్ల […]
Read more

యూపీలో ఇద్దరు మహిళల మత మార్పిడిని సమర్థించిన అలహాబాద్ హైకోర్టు!

లక్నో: స్వచ్ఛందంగా ఇస్లాం మతంలోకి మారినట్లు పేర్కొన్న ఇద్దరు హిందూ మహిళలను విడుదల చేయాలని అలహాబాద్ హైకోర్టు గత వారం ఆదేశించింది. నచ్చిన మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ వయోజనులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని గుర్తు చేస్తూనే.. వారి స్వేచ్ఛను కాపాడడంంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు తీవ్రంగా విఫలం అయ్యారని పేర్కొంది. ఈ సందర్భంగానే బాధితులు అయిన ఇద్దరు అమ్మాయిలకు.. వారి తండ్రితో పాటు యూపీ సర్కారు సంయుక్తంగా రూ.25 లక్షల పరిహారాన్ని చెల్లించాలని స్పష్టం చేసింది. […]
Read more

స్వతంత్ర ఆలోచనలపై చర్చను రేకెత్తించిన ఉమర్ ఖాలిద్ ‘ఫ్రాక్చర్డ్ కమ్యూనిటీస్’ పుస్తకం!

న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త, జేఎన్‌యూ మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ జైలు నుంచి చేసిన పీహెచ్‌డీ థీసిస్ ఆధారంగా రూపుదిద్దుకున్న గ్రంథమే ‘ఫ్రాక్చర్డ్ కమ్యూనిటీస్. ఈ పుస్తకంపై ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన చర్చా కార్యక్రమంలో విద్యావేత్తలు, పాత్రికేయులు, రాజకీయ ప్రముఖులు, మానవహక్కుల కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు పుస్తకంలోని చారిత్రక ఇతివృత్తాలతో పాటు విద్య, అసమ్మతి, స్వేచ్ఛ, న్యాయం వంటి విస్తృత ప్రశ్నలను విశ్లేషించారు. జగ్గర్‌నాట్ బుక్స్ ప్రచురించిన ‘ఫ్రాక్చర్డ్ కమ్యూనిటీస్’ […]
Read more

ఇరాన్‌తో సుదీర్ఘ యుద్ధం…ఆత్మహత్యకు యత్నించిన అమెరికా నావికులు!

వాషింగ్టన్‌: యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్ విమానవాహక నౌకలోని అమెరికన్ నావికులు తీవ్ర నిరాశ, అలసటతో ఆత్మహత్యలకు (సముద్రంలో దూకి ప్రాణాలు తీసుకునేందుకు) యత్నించినట్లు నివేదికలు వెల్లడించాయి. మిలిటరీ టైమ్స్ నివేదిక ప్రకారం…నావికులు నెలల తరబడి సముద్రంలో ఉండటం, క్షీణిస్తున్న జీవన పరిస్థితులు, పదేపదే మోహరింపు పొడిగింపులు సిబ్బందిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, నౌకలో అనేక ఆత్మహత్యాయత్నాలు జరిగాయని చెబుతున్నాయి. USS అబ్రహం లింకన్ నౌక ఇప్పుడు తొమ్మిది నెలలుగా సముద్రంలో ఉంది, ఇందులో రికార్డు స్థాయిలో వరుసగా […]
Read more

తెలంగాణలో SIR మొదటి దశ పూర్తి… ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితా!

హైదరాబాద్: తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తేల్చారు. తెలంగాణలో 73,95,954 మంది ఓటర్లను తొలగించినట్లు సమాచారం. ఇప్పటివరకు 2,64,30,494 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. కాగా, ఖమ్మం జిల్లాలో ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR) మొదటి దశ పూర్తయిందని, ముసాయిదా ఓటర్ల జాబితాను ఆగస్టు 17న ప్రచురించనున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర తెలిపారు. ఈ మేరకు ఆయన […]
Read more

‘నియోజకవర్గాల పునర్విభజన బిల్లు రెడీ’!

న్యూఢిల్లీ: ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో డీలిమిటేషన్‌ బిల్లు, మహిళా రిజర్వేషన్ల బిల్లులను ఆమోదింపజేసుకునే ప్రయత్నంలో 54 మంది ఎంపీల కొరత ఎదురైన తర్వాత, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్‌డీఏ…ఈ వర్షాకాల సమావేశాల్లో ఆ లోటును భర్తీ చేసుకునేందుకు పావులు కదుపుతోంది. ప్రస్తుతం రాజ్యాంగం ప్రకారం లోక్‌సభలో గరిష్టంగా 550 మంది సభ్యులు ఉంటారు. వీరిలో రాష్ట్రాల నుంచి 530 మంది వరకు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 20 మంది వరకు సభ్యులు ఉంటారు. […]
Read more

రాజకీయ లబ్ధి కోసం విద్యార్థుల నిరసనను ఆయుధంగా వాడుకుంటున్న బీజేపీ…జార్ఖండ్ సీఎం!

రాంచీ: నియామక పరీక్షలలో జరిగిన అవకతవకలపై కొనసాగుతున్న విద్యార్థి ఉద్యమాన్ని బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆరోపించారు. ఈ నిరసనలను తమ ప్రభుత్వం తీరును ఆయన సమర్థించుకున్నారు. నియామక ప్రక్రియలో సంస్కరణల కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో మాట్లాడుతూ…యువతను తప్పుదోవ పట్టించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, బీజేపీ నాయకులు ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం ‘విద్యార్థి ముసుగు’ వాడుకుంటున్నారని సోరెన్ ఆరోపించారు. నియామక […]
Read more

మయన్మార్ సైన్యం తమ పౌరులపై భారీగా వైమానిక దాడులు చేస్తోంది… ఐక్యరాజ్యసమితి!

నైపితా: మయన్మార్ సైన్యం దేశంలో తమ పౌరులపై వైమానిక దాడులను, హింసను భారీగా పెంచిందని ఐక్యరాజ్యసమితి (UN) పరిశోధకులు తమ తాజా నివేదికలో వెల్లడించారు. నివాసాలు, పాఠశాలలు, వైద్య కేంద్రాలు, శరణార్థుల శిబిరాలపై ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్నాయని, ఇది యుద్ధ నేరాల కిందకు వస్తుందని యునైటెడ్ నేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా, రఖైన్ రాష్ట్రంలో ప్రభుత్వంతో పోరాడుతున్న ఒక ప్రధాన జాతి సాయుధ బృందం ఈ నెలలో ఇప్పటివరకు సైన్యం చేసిన దాడుల్లో 20 […]
Read more
1 19 20 21 22 23 236

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.