Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

అణువిద్యుత్‌ రంగంలో ప్రైవేటు కంపెనీలకు పచ్చజెండా?!

న్యూఢిల్లీ: దశాబ్దాలుగా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అణుశక్తి రంగంలో ప్రైవేటు రంగానికి కేంద్రం తలుపులు తెరిచింది. ఈమేరకు లోక్‌సభలో శాంతి బిల్లును ప్రవేశపెట్టారు. సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా (SHANTI) బిల్లు-2025ను తీసుకొచ్చారు. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించినట్లయితే… ఈ బిల్లు అణుశక్తి చట్టం-1962ను రద్దు చేస్తుంది. ఈ కొత్త బిల్లు, ప్రైవేట్ కంపెనీలను 49% వరకు విదేశీ పెట్టుబడులతో సహా, అణు విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించడానికి, నిర్వహించడానికి […]
Read more

‘అహ్మద్ ఆస్ట్రేలియా హీరో’…ప్రధాని అల్బనీస్‌!

సిడ్నీ: ఆస్ట్రేలియా బీచ్‌లో ఉగ్రవాదిని ధైర్యంగా ఎదుర్కొని తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో కోలుకుంటున్న ముస్లిం వ్యక్తి అహ్మద్‌ను ఆస్ట్రేలియా ప్రధాని పరామర్శించారు. బెడ్ పక్కన నిలబడి అతడి అసాధారణ ధైర్యాన్ని ప్రశంసించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొని జాతీయ ఐక్యతకు చిహ్నంగా నిలిచారని ఆయనను అభివర్ణించారు. అతడి తెగింపును యావత్తు ప్రపంచమంతా ప్రశంసిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అహ్మద్‌ను హీరో అంటూ కొనియాడిని విషయం విధితమే. మరోవంక అహ్మద్‌ను పరామర్శించిన అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని చేసిన ట్వీట్‌ […]
Read more

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 39 సర్పంచ్ స్థానాలను గెలుచుకున్న ముస్లింలు!

హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో ముస్లింలు క్రమంగా వెనుకబడిపోతున్న సమయంలో…తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆ సమాజం ఒక ఉదాహరణగా నిలిచింది. డిసెంబర్ 14న జరిగిన రెండవ దశ ఎన్నికల్లో అనేక మంది మహిళలు సహా మొత్తం 39 మంది ముస్లిం అభ్యర్థులు సర్పంచ్‌లుగా గెలుపొందారు. సర్పంచ్‌లుగా ముస్లింల విజయం తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ రాజకీయాల్లో వారి పెరుగుతున్న పాత్రను ప్రతిబింబిస్తుంది. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో పాలక కాంగ్రెస్ గెలిచిన తరువాత, […]
Read more

గాజా కాల్పుల విరమణ ఉల్లంఘనపై నెతన్యాహును హెచ్చరించిన అమెరికా!

వాషింగ్టన్‌: గాజాలో ఇజ్రాయెల్ దాడి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని వైట్ హౌస్ నొక్కి చెప్పింది. ఈమేరకు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు “కఠినమైన” ప్రైవేట్ సందేశాలను పంపింది. వారాంతంలో గాజా నగరంలో జరిగిన దాడిలో హమాస్ సైనిక విభాగం డిప్యూటీ కమాండర్ రయీద్ సాద్‌ను ఇజ్రాయెల్ చంపిన తర్వాత ఈ సందేశం వచ్చిందని మీడియాతో మాట్లాడిన వర్గాలు తెలిపాయి. ఈ దాడిలో మొత్తం నలుగురు మరణించారు. […]
Read more

త్వరలో కొత్త ‘సీడ్‌ పాలసీ’ తేనున్న తెలంగాణ!

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 100 ‘విత్తన హబ్‌లను’ ఏర్పాటు చేసే లక్ష్యంతో రైతులకు అనుకూలమైన కొత్త విత్తన విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ దిశగా, ఇటీవల జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్ 2047- విజన్ డాక్యుమెంట్‌లో, ప్రపంచ అవసరాలను కూడా తీర్చడానికి తెలంగాణను విత్తన ఉత్పత్తి కేంద్రంగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇప్పటికే ఒక కార్యాచరణ ప్రణాళికను ఆవిష్కరించింది. రాష్ట్రంలోని 100 అగ్రశ్రేణి విత్తన కంపెనీల భాగస్వామ్యంతో త్వరలో అత్యాధునిక […]
Read more

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సులు, కార్లు ఢీ… నలుగురు మృతి!

న్యూఢిల్లీ: ఈరోజు ఉదయం మధురలోని ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించక ఏడు బస్సులు, మూడు కార్లు ఢీకొన్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కనీసం నలుగురు మృతి చెందగా, 25 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 11 ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. ఇప్పటి వరకు నలుగురి మృతదేహాలను గుర్తించారు. భారీ పొగమంచు […]
Read more

ఉపాధి హామీ రద్దు… కొత్త పథకాన్ని తీసుకొస్తున్న ప్రభుత్వం!

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, ‘వికసిత భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్‌ను… G RAM G పేరుతో కొత్త చట్టం తీసుకు రాబోతోంది. దీని ద్వారా ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతూ, పథకం పేరును ‘పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన’గా మార్చడానికి లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం లోక్‌సభ […]
Read more

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు…రెండవ దశలోనూ కాంగ్రెస్ హవా!

హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికారపార్టీ అద్భుతమైన ప్రదర్శనను కొనసాగించింది. రెండవ దశలోనూ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. నిన్న జరిగిన ఎన్నికల్లో 4,333 సర్పంచ్ పదవులకు గానూ, కాంగ్రెస్ 2,216 స్థానాలను గెలుచుకుంది. ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (BRS) 1,177 స్థానాలతో రెండవ స్థానంలో నిలిచింది. భారతీయ జనతా పార్టీ (BJP) 259 స్థానాలతో మూడవ స్థానంలో ఉంది. స్వతంత్రులు, ఇతరులు 619 స్థానాలను గెలుచుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 193 […]
Read more

టోలిచౌకిలో పార్కింగ్ వివాదం…ఎంబీఏ విద్యార్థి హత్య!

హైదరాబాద్: టోలిచౌకి పారామౌంట్ కాలనీలో ఆదివారం రాత్రి ఎంబీఏ విద్యార్థిని కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. టోలిచౌకి నివాసి అయిన 21 ఏళ్ల మొహమ్మద్ ఇర్ఫాన్ ఒక కళాశాలలో ఎంబీఏ కోర్సు చదువుతూ మధ్యాహ్నం తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆటో రిక్షా నడుపుతున్నాడు. ఇర్ఫాన్ ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. శనివారం రాత్రి ఓ 6 మంది వ్యక్తులు ఇర్ఫాన్ ఇంటికి వచ్చి పారామౌంట్ కాలనీ గేట్ నంబర్ 1 వద్దకు తీసుకెళ్లారు. ఆ […]
Read more

దళితులు, మైనారిటీల ఓటు హక్కును హరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది…సీఎం రేవంత్ రెడ్డి!

న్యూఢిల్లీ: దళితులు, ఆదివాసీలు, మైనారిటీల ఓటు హక్కును హరించేందుకు బిజెపి పనిచేస్తోందని, అది పూర్తయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డుదారుల జాబితా నుండి వారి పేర్లను తొలగించి, వారి ఆస్తులను లాక్కుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇది ఎన్నికల సమస్య కాదు, కాంగ్రెస్ సమస్య కాదు, దేశవ్యాప్త సమస్య. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడేందుకు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలను ఎదుర్కోవడానికి వీలుగా రాహుల్ గాంధీ చేపట్టిన ఈ పోరాటానికి […]
Read more
1 20 21 22 23 24 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.