Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఆగస్టు 15న తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

హైదరాబాద్: తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రజలకు కొత్త పీడీఎస్ రేషన్ కార్డులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపిణీ చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా జరగనున్న ఈ కార్యక్రమ షెడ్యూల్‌కు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని తెలంగాణ నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమం సంగారెడ్డిలో జరగనుంది, అక్కడ ముఖ్యమంత్రి లాంఛనంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని 119 […]
Read more

పోలీసులు మమ్మల్ని కొట్టారు…రాహుల్‌తో పాటు మీడియాతో మాట్లాడిన జెన్ జెడ్ తరం!

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జూలై 20న జరిగిన విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసుల క్రూరత్వంపై, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ యువ నిరసనకారుల వెనుక నిశ్శబ్దంగా నిలబడి, వారి మాటలను శ్రద్ధగా వింటూ, భరోసా ఇస్తూ నవ్వుతూ, వారిని నిరంతరాయంగా మాట్లాడనిస్తూ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. రెండు వారాల లోపే ఇది ఆయనకు రెండోసారి. జూలై 25న, రాహుల్‌ గాంధీ తన పక్కన ఐసా (AISA) అధ్యక్షురాలు నేహా బోరా, ఇతర విద్యార్థి కార్యకర్తలతో కలిసి […]
Read more

మదర్సాలు ‘వందేమాతరం’ పూర్తి గీతాన్ని ఆలపిస్తే ‘ఆకాశం ఊడిపడదు’…కలకత్తా హైకోర్టు!

కోల్‌కత: మదర్సాలలో వందేమాతరంలోని ఆరు చరణాలనూ పాడితే “ఆకాశం కూలిపోదని కలకత్తా హైకోర్టు మంగళవారం మౌఖికంగా వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని, రాష్ట్ర గుర్తింపు పొందిన మదర్సాలలో ఈ పద్ధతిని తప్పనిసరి చేస్తూ మే 19న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి తపబ్రత చక్రవర్తి, జస్టిస్ పార్థ సారథి సేన్‌లతో కూడిన ధర్మాసనం పిటిషనర్ల […]
Read more

హర్ముజ్ జల మార్గంపై ఇరాన్, ఒమన్ అంగీకారం!

టెహ్రాన్: హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే రూట్‌పై ఇరాన్, ఒమన్ అంగీకారానికి వచ్చాయని, ఈ మార్గాన్ని సంయుక్తంగా నిర్వహించే ఏర్పాట్లకు తుది మెరుగులు దిద్దుతున్నాయని టెహ్రాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. “ఇరు పక్షాలు ఊహించిన మార్గం భౌగోళిక అక్షాంశాలపై ఒక అంగీకారం కుదిరింది. కొన్ని మూడవ పక్షాలు ఈ ప్రక్రియకు ఆటంకం కలిగించకపోతే…ఇరు దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేసే అవకాశముందని అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ తెలిపినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ పేర్కొంది. […]
Read more

ఇకనుంచి ఎమర్జెన్సీ సేవలకు ‘112’…’డయల్ 100’కు వీడ్కోలు!

హైదరాబాద్‌: తెలంగాణ అత్యవసర సేవల కోసం దశాబ్దాలుగా వాడుకలో ఉన్న డయల్ 100, 101, 108 నంబర్లకు వీడ్కోలు పలికింది. ఇకనుంచి ఎమర్జెన్సీ సేవల్లో భాగంగా, “ఒకే దేశం, ఒకే అత్యవసర నంబర్” అనే నినాదంతో 18 అత్యవసర సేవలను ఒకే గొడుగు కింద అందుబాటులోకి తెచ్చారు. ఈ నంబర్లను ఇప్పుడు డయల్ 112 అనే ఒకే నంబర్ కిందకు తీసుకొచ్చారు. ఈ కొత్త వేదిక పోలీస్, అగ్నిమాపక సేవలు, అంబులెన్స్, మహిళా భద్రత, బాలల రక్షణ, […]
Read more

గోపూజను వ్యతిరేకించిన సావర్కర్!

పూణే: వినాయక్ దామోదర్ సావర్కర్ ఆవును దేవతగా కాకుండా ఉపయోగకరమైన జంతువుగా భావించాడని అతని మనవడు సత్యకి సావర్కర్ పూణేలోని ప్రత్యేక కోర్టుకు తెలిపారు. కొనసాగుతున్న క్రిమినల్ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తరపు న్యాయవాది మిలింద్ పవార్ క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2023లో లండన్‌లో చేసిన ప్రసంగంలో సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. ముస్లిం వ్యక్తిపై దాడి చేయడం గురించి […]
Read more

బాబు పుట్టాడు… ఉదారత పండింది!

కువైట్: వారసుడొచ్చిన ఆనందంలో అపరిచితులకు నగదు, ఉచిత షాపింగ్‌తో ఓ కువైట్ తండ్రి ఆశ్చర్యపరిచాడు. స్వార్థం రాజ్యామేలుతున్న నేటి కాలంలో, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేసే సాయం మానవత్వానికి నూతన వెలుగులు నింపుతోంది. కంటికి కనిపించని అనుబంధాలను, ముఖపరిచయం లేని బంధుత్వాలను ముడివేసేది ఒక్క ప్రేమ మాత్రమేనని నిరూపించింది ఈ సంఘటన! ఇటీవల కువైట్‌లో జరిగిన ఓ అరుదైన ఉదంతం సామాజిక మాధ్యమాల్లోనూ, ప్రజల హృదయాల్లోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. వివరాల్లోకి వెళ్తే…నిండైన వార్త… పండగలాంటి ఆనందం! […]
Read more

స్టైఫండ్ పెంపు కోసం తెలంగాణ ఆయుష్‌ వైద్యుల నిరవధిక సమ్మె

హైదరాబాద్: స్టైఫండ్ పెంపు, అల్లోపతి వైద్యులతో సమానమైన వేతనం, ఆర్థికపరమైన సమస్యల పరిష్కారం డిమాండ్ చేస్తూ, తెలంగాణ వ్యాప్తంగా సుమారు 6,000 మంది AYUSH (ఆయుర్వేద, యోగా, ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ,హోమియోపతి) హౌస్ సర్జన్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు నిన్నటినుండి నిరవధిక సమ్మెను ప్రారంభించారు. ఎర్రగడ్డలోని డాక్టర్ BRKR ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, బేగంపేటలోని కొణిజేటి రోశయ్య ప్రభుత్వ ప్రకృతి వైద్య ఆసుపత్రి, చార్మినార్‌లోని ప్రభుత్వ నిజామియా యునాని ఆసుపత్రి వద్ద నిరసనలు జరిగాయి. తమ […]
Read more

గాజాపై ఆమ్నెస్టీ నివేదిక…భారత నేతలపై ఐసీసీ విచారణకు తొలి అడుగు కావచ్చు!

సయ్యద్ ఖలీక్ అహ్మద్…✍️ న్యూఢిల్లీ: గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణహోమ యుద్ధానికి సంబంధించిన ఆయుధాల ఎగుమతి నిర్ణయాలలో పాలుపంచుకున్న భారత అధికారులపై భవిష్యత్తులో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) జరిపే విచారణకు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వారి ‘మేడ్ ఇన్ ఇండియా’ నివేదిక తొలి అడుగు కాగలదని అమెరికా విదేశాంగ విధాన నిపుణుడు డా.ముఖ్తేదార్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర సీనియర్ భారత మంత్రులు, పరిపాలనా అధికారులపై ఐసీసీ ఇప్పటికే కేసు నమోదు చేసిందన్నది అతని […]
Read more

మోదీ, అమిత్‌షా ‘పార్లమెంటును అవమానిస్తున్నారు…ఆరోపించిన ఖర్గే!

న్యూఢిల్లీ: రామమందిర విరాళాల చోరీ వ్యవహారం, జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల చర్యకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకోవడం ద్వారా, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా పార్లమెంటును అవమానిస్తున్నారని, లేదంటే భయపడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే పార్లమెంటు ఉభయ సభలలోనూ ఈ రెండు అంశాలపై చర్చ జరగాలని ఖర్గే డిమాండ్ చేశారు. ఈ అంశంపై లోక్‌సభ, రాజ్యసభలలో ప్రతిపక్ష సభ్యులు […]
Read more
1 22 23 24 25 26 236

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.