Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

గాజాలో ఆహార సంక్షోభం…దిగ్బంధనం నేపథ్యంలో మూతపడ్డ ఐక్యరాజ్యసమితి బేకరీలు!

డీర్ అల్-బలా: ఇజ్రాయెల్‌ దిగ్బంధనం కారణంగా గాజాలో ఆహార సంక్షోభం నెలకొంది. నెల రోజులగా గాజా స్ట్రిప్‌కు ఎలాంటి దిగుమతులను అనుమతించకపోవడంతో ఆహార సరఫరా తగ్గిపోయింది. ఫలితంగా ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థ తన బేకరీలన్నింటినీ మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. హమాస్ తమ కాల్పుల విరమణ ఒప్పందంలో మార్పులను అంగీకరించమని ఒత్తిడి చేసేందుకు ఇజ్రాయెల్‌ తన దిగ్బంధనను కఠినతరం చేసింది. ఆ తరువాత బాంబు దాడులతో విరుచుకుపడుతోంది. ఆరు వారాల కాల్పుల విరమణ సమయంలో గాజాలోని దాదాపు 2 […]
Read more

హైదరాబాద్ వర్సిటీ భూ వివాదం…400 ఎకరాలు ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం!

హైదరాబాద్: హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వేలం వేయాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒక చిన్న సాంకేతికత కారణం ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం తన ఇష్టానుసారం భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఆస్కారముంది. వాస్తవం ఏమిటంటే, నేటికీ UoH భూమి రాష్ట్రానికే చెందుతుంది. భూమిని అధికారికంగా వర్సిటీకి బదిలీ చేయనందున, అది ఏర్పాటైనప్పటి నుండి అదే పరిస్థితి. 400 ఎకరాలకు సంబంధించి రెండు […]
Read more

వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయనున్న ఇండియా కూటమి ఎంపీలు!

న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లుపై నేడు పూర్తి చర్చ జరపాలని ప్రతిపక్షం ఏకగ్రీవంగా నిర్ణయించింది పార్లమెంటులో దానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని తీర్మానించింది. నిన్న సాయంత్రం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు, దీనికి అన్ని ప్రతిపక్ష పార్టీలు హాజరయ్యాయి. “బిల్లుపై చర్చలో చురుకుగా పాల్గొనాలని మేము నిర్ణయించుకున్నాము, బిల్లును ఆమోదింప చేయకుండా ప్రతిపక్షం బలంగా వ్యవహరిస్తుందని ఆర్‌ఎస్‌పికి చెందిన ఎన్‌కె ప్రేమచంద్రన్ NDTVకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రతిపక్షం ప్రతి దశలోనూ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు […]
Read more

వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించాలని ఎంపీలకు విజ్ఞప్తి చేసిన ముస్లిం పర్సనల్ లా బోర్డు!

న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించాలని, దానికి అనుకూలంగా ఓటు వేయొద్దని బిజెపి మిత్రపక్షాలు, పార్లమెంటు సభ్యులు సహా అన్ని లౌకిక రాజకీయ పార్టీలకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) విజ్ఞప్తి చేసింది. పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టినప్పుడు, అన్ని లౌకిక పార్టీలు, ఎంపీలు బిల్లును వ్యతిరేకించాలని AIMPLB అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహ్మానీ పిలుపునిచ్చారు. బిల్లును ఓడించడానికి,బిజెపి మతపరమైన ఎజెండాను అడ్డుకోవడానికి తమ ఓట్లను ఉపయోగించాలని ఆయన వారిని కోరారు. ఈ […]
Read more

రంజాన్‌ రోజున గాజాలో 64 మందిని చంపిన ఇజ్రాయెల్…తప్పిపోయిన 14 మంది వైద్యుల మృతదేహాలు స్వాధీనం!

గాజా : ఈద్ అల్-ఫితర్ పండుగ రోజున గాజాలో పిల్లలతో సహా కనీసం 64 మందిని ఇజ్రాయెల్ దళాలు చంపాయని పాలస్తీనా అధికారులు తెలిపారు. అదేసమయంలో తప్పిపోయిన 14 మంది వైద్యుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ గాజాలోని రఫా సమీపంలో వైద్యుల వాహనాలు ఇజ్రాయెల్ కాల్పులకు గురైన వారం తర్వాత, పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సొసైటీ (PRCS) ఎనిమిది మంది వైద్యులు, ఐదుగురు పౌర రక్షణ కార్మికులు, ఒక UN ఉద్యోగి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. […]
Read more

మేఘాలయ మాజీ సీఎం పీఎ సంగ్మాపై విరుచుకుపడ్డ మణిపూర్‌ మాజీ సీఎం…దురదృష్టకరమన్న కాన్రాడ్‌ సంగ్మా!

గువహటి/న్యూఢిల్లీ: హింసతో అల్లాడుతున్న మణిపూర్‌ “అంతర్గత విషయాలలో జోక్యం చేసుకుంటున్నారు” అంటూ మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మాపై మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ మాటల దాడి చేశారు. కాగా, ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ…ఇలా మాట్లాడటం “దురదృష్టకరం” అని మేఘాలయ సీఎం అభివర్ణించారు. అయితే మేఘాలయ ముఖ్యమంత్రిపై తన తాజా మాటలదాడికి కారణమేమిటో బీరేన్‌ సింగ్ చెప్పలేదు. వివరాల్లోకి వెళ్తే… సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి) 2024 నవంబర్‌లో అప్పటి బిరేన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు […]
Read more

కంచ గచ్చిబౌలి భూముల వేలాన్ని తప్పుబట్టిన మానవహక్కుల వేదిక!

హైదరాబాద్: కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల భూమిని TGIIC ద్వారా వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మానవ హక్కుల వేదిక (HRF) తీవ్రంగా ఖండించింది. ఈ భూమిని మొదట భారత ప్రభుత్వం 1973లో విద్యా, పరిశోధన ప్రయోజనాల కోసం UoHకి కేటాయించిందని సంస్థ తెలిపింది. “ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది చేస్తున్న నిరసనలు విద్యా, పర్యావరణ ప్రయోజనాల కోసం భూమిని దక్కించుకోవాల్సిన ప్రాముఖ్యతను చాటిచెబుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ […]
Read more

తెలంగాణలో ఘనంగా ఈద్‌ ఉల్‌ ఫితర్‌ వేడుకలు!

హైదరాబాద్‌ : తెలంగాణ అంతటా రంజాన్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. మసీదులు,ఈద్గాల వద్ద ప్రజలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హైదరాబాద్‌లో మీర్ ఆలం ఈద్గా, మక్కా మసీదులలో పెద్ద సంఖ్యలో జనం ఈద్-ఉల్-ఫితర్‌ నమాజ్‌ ఆచరించారు. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మీర్ ఆలం ఈద్గాలో నమాజ్‌ చదివారు. దేశంలో శాంతి, న్యాయం జరగాలని దుఆ చేశారు. . “ఈద్ అల్ ఫితర్ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, మన […]
Read more

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌…16 మంది మావోయిస్టుల మృతి!

సుక్మా: ఈ రోజు ఉదయం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిన మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లో కనీసం 16 మంది నక్సలైట్లు మరణించగా, ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడిన జవాన్లు రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) విభాగానికి చెందినవారని వారు తెలిపారు. కేర్లపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో ఉదయం 8 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయని, అక్కడ భద్రతా సిబ్బంది ఉమ్మడిగా నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్‌కు బయలుదేరారని […]
Read more

ఏప్రిల్‌ 5లోగా రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోండి..మైనారిటీ యువతను ప్రోత్సహిస్తున్న కమ్యూనిటీ నాయకులు!

హైదరాబాద్‌ : నిరుద్యోగ ముస్లిం యువత వ్యాపారాలు ప్రారంభించడానికి వీలుగా రూ. 4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మైనారిటీ యువతను కమ్యూనిటీ నాయకులు ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం కింద మైనారిటీల కోసం రూ. 840 కోట్లు కేటాయించింది, జనాభా అంచనాల ఆధారంగా ముస్లిం దరఖాస్తుదారులకు రూ. 751 కోట్లు కేటాయించింది. తెలంగాణ అంతటా దాదాపు 42,000 మంది మైనారిటీ యువత ప్రయోజనం పొందుతారని […]
Read more
1 77 78 79 80 81 95

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.