Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

రేపు ఇజ్రాయెల్‌కు వెళ్లనున్న మోడీ…పాలస్తీనియన్లను పట్టించుకోలేదని ఆరోపించిన కాంగ్రెస్‌!

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం ఇజ్రాయెల్‌కు వెళ్లడానికి సిద్ధమవుతుండగా, పాలస్తీనియన్ల కోరికకు భారత ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవలేదని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈమేరకు కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేష్ మాట్లాడుతూ…మోడీ ప్రభుత్వం పాలస్తీనియన్ల ఆకాంక్షలకు బహిరంగంగా మద్దతు వ్యక్తం చేసినప్పటికీ… వారిని “వదిలేసింది” అని ఒక ప్రకటనలో ఆరోపించారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఉంటున్న పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ తరలించడం తప్పని, ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీసిందని, గాజాలో పౌరులపై […]
Read more

రాహుల్ గాంధీని ప్రశంసించిన ఒమర్ అబ్దుల్లా!

శ్రీనగర్‌: ప్రతిపక్షనేతగా రాహుల్‌గాంధీ పనితీరును జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ప్రశంసించారు. అదేసమయంలో ఇండియా కూటమిలో నాయకత్వ మార్పు సూచనలను తిప్పికొట్టారు. రాహుల్ గాంధీకి బదులుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారత కూటమికి నాయకత్వం వహించాలని సూచించిన మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. ఇండియా కూటమిలో నాయకత్వ మార్పుపై అలాంటి చర్చ జరగలేదని అబ్దుల్లా అన్నారు. గతంలో కూటమి పనితీరు, కాంగ్రెస్ లేవనెత్తిన “ఓటు చోరి”, ఈవీఎంల రిగ్గింగ్ […]
Read more

భారత్‌ సహా మరికొన్ని దేశాలతో ‘షడ్భుజి’ కూటమిని ఏర్పాటు చేస్తున్న నెతన్యాహు!

టెల్‌అవీవ్: భారత్‌, గ్రీస్, సైప్రస్ సహా కొన్ని అరబ్, ఆఫ్రికన్, ఆసియా దేశాలతో కలిసి ‘షడ్భుజి’ (Hexagon) కూటమిను ఏర్పాటు చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈమేరకు నెతన్యాహు ఇజ్రాయెల్‌ పార్లమెంటులో మాట్లాడుతూ… టెహ్రాన్‌తో ఉద్రిక్తత పెరిగే అవకాశంపై పెరుగుతున్న ఆందోళనను సూచిస్తూ, రాబోయే కాలం గణనీయమైన అనిశ్చితిని కలిగి ఉంటుందని హెచ్చరించారు. “”రేపు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు అని ఒకింత వేదాంత ధోరణిలో మాట్లాడారు.” ఇజ్రాయెల్ ఘర్షణకు సిద్ధమవుతున్నందున రాజకీయ ఐక్యతకు […]
Read more

‘జిమ్ సభ్యత్వం తీసుకుంటా’…’మహమ్మద్’ దీపక్‌తో భేటీ అయిన రాహుల్!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరాఖండ్‌కు చెందిన జిమ్ యజమాని ముహమ్మద్‌ దీపక్‌తో భేటీ అయ్యారు. అతను ఇటీవల ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లో ముస్లిం దుకాణదారుడికి మద్దతుగా నిలిచి, భజరంగ్‌దళ్ కార్యకర్తలను ఎదిరించి “మహమ్మద్ దీపక్”గా వెలుగులోకి వచ్చాడు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ నివాసం 10, జనపథ్‌‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు వైభవ్ వాలియా, జిమ్ యజమాని దీపక్ కుమార్, అతని స్నేహితుడు విజయ్ రావత్ సహా ఇంకా అనేక మంది […]
Read more

‘మెట్రో’ టేకోవర్‌కు తెలంగాణ క్యాబినెట్‌ ఓకే!

హైదరాబాద్‌: హైదరాబాద్ మెట్రో టేక్‌ఓవర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంది. 2026 మార్చి 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని, ఎల్‌అండ్‌టీ అప్పులను (సుమారు ₹13,000 కోట్లు) ప్రభుత్వం భరించి, 90% ఈక్విటీని తీసుకునేలా, మెట్రోను పూర్తిగా ప్రభుత్వపరం చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం తన ఈక్విటీ పెట్టుబడి కోసం ఎల్ అండ్ టీకి రూ.2,000 కోట్లు కూడా చెల్లిస్తుంది. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు అనుమతి కావాలంటే […]
Read more

మూకదాడిలో గాయపడ్డ మణిపూర్ బిజెపి ఎమ్మెల్యే ప్రధాని మోడీకి లేఖ రాసారని తెలిపిన హిందూ పత్రిక!

న్యూఢిల్లీ: మణిపూర్‌ జాతి అల్లర్ల సమయంలో జరిగిన దారుణమైన మూక దాడిలో గాయాలతో ఫిబ్రవరి 20న మరణించిన బీజేపీ ఎమ్మెల్యే ఐదు నెలల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసారు. ఈ దాడిపై దర్యాప్తు చేయడానికి సిట్‌ను ఏర్పాటు చేయలేదని సదరు శాసనసభ్యుడి తెలిపారని ది హిందూ పేర్కొంది. 2023 మే ప్రారంభంలో రాష్ట్రంలో మొదటిసారి హింస చెలరేగిన రెండు సంవత్సరాల తర్వాత – మణిపూర్‌లో ప్రధానమంత్రి తొలిసారిగా పర్యటించిన సందర్భంగా – 2025 సెప్టెంబర్ […]
Read more

పాలస్తీనా ఖైదీలను ‘సరైన సమయంలో’ ఉపవాసం ఉండకుండా అడ్డుకుంటున్న ఇజ్రాయెల్!

జెరూసలేం: పవిత్ర రంజాన్ మాసంలో ఖైదీలు “సరైన సమయంలో” ఉపవాసం ఉండకుండా ఇజ్రాయెల్ జైలు అధికారులు అడ్డుకుంటున్నారని పాలస్తీనా కమిషన్ ఆరోపించింది. ఈమేరకు ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ నగరమైన రమల్లాలోని ఓఫర్ జైలు అధికారులు… ఖైదీలు తమ ఉపవాసం ప్రారంభించడానికి, విరమించడానికి వీలుగా ఆయా సమయాల్లో వారిని అప్రమత్తం చేయడానికి నిరాకరిస్తున్నారని పాలస్తీనా కమీషన్ ఫర్ డిటైనీస్ అఫైర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. “ఖైదీలు సహరీ (సూర్యాస్థమయానికి ముందు భోజనం) లేకుండా రంజాన్ పాటిస్తారు, ఇఫ్తార్ (ఉపవాసం […]
Read more

బెంగాలీ మాట్లాడేవారిని ‘చొరబాటుదారులు’గా ముద్రవేయడం సరికాదన్న మమతా బెనర్జీ!

కోల్‌కత: బెంగాలీ మాట్లాడే ప్రజలను అవమానించడానికి విభజన శక్తులు ప్రయత్నించడం, వారిని “చొరబాటుదారులు (అక్రమ వలసదారులు)”గా ముద్రవేసి వేధించడం పట్ల తాను తీవ్రంగా బాధపడ్డానని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. అదే సమయంలో, సంకుచిత రాజకీయాల ద్వారా “బెంగాల్ సంస్కృతిని అణగదొక్కే ప్రయత్నానికి వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటం కొనసాగిస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎవరినీ నేరుగా లక్ష్యంగా చేసుకోనప్పటికీ, పరోక్షంగా బీజేపీపైనే విమర్శలు ఎక్కుపెట్టినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే దేశంలోని పాలక పార్టీ గత కొన్నేళ్లుగా […]
Read more

తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్ట్‌ అగ్రనేతలు!

హైదరాబాద్‌: మావోయిస్టు అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ, రాజిరెడ్డి అలియాస్ గంగన్న తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారితో పాటు మరో 16 మంది సభ్యులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు మొగ్గు చూపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సలిజాన్ని అంతం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ పట్టుదలకు ఈ లొంగుబాటు ఒక పెద్ద విజయంగా కనిపిస్తోంది. కాగా, దేవ్‌జీ దేవ్జీ కేంద్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మల్లా రాజిరెడ్డి పొలిట్‌బ్యూరో సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టు […]
Read more

స్క్రాప్ డీలర్ నిజాయితీ: ₹15 లక్షల విలువైన బంగారాన్ని యజమానులకు అప్పగించిన హాజీ అక్తర్ ఖాన్!

-ముజాహిద్ నేటి సమాజంలో నైతిక విలువల కంటే ధనానికే ప్రాముఖ్యత ఇస్తున్న తరుణంలో, హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన ఒక పాత సామాన్ల వ్యాపారి (Scrap Dealer) మానవత్వానికి కొత్త అర్థాన్ని ఇచ్చారు. పొరపాటున పాత సామాన్లతో పాటు అమ్మేసిన సుమారు ₹15 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఆయన తిరిగి యజమానికి అప్పగించి, తన నిజాయితీని చాటుకున్నారు. అసలేం జరిగింది?స్థానిక నివాసి అయిన అశోక్ శర్మ తన ఇంట్లోని సుమారు 100 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగల […]
Read more
1 … 87 88 89 90 91 … 237

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.