32.2 C
Hyderabad
Saturday, May 18, 2024

మార్పు చైతన్యానికి చిహ్నం

చైతన్యం జీవనానికి చిహ్నం. ప్రకృతి ప్రతి ఋతువులోనూ తన స్వభావాన్ని మార్చుకుంటుంది. శిశిరంలో ఆకురాల్చిన చెట్టు వసంతంలో చిగురిస్తుంది. సృష్టిలో ప్రతి ప్రాణి తన అంతః బాహ్య స్వభావాలను నిరంతరం కాలానుగుణంగా మార్చుకొంటున్నాయి. ప్రకృతిలో మార్పు అత్యంత సహజమైన జీవన ప్రక్రియ. మార్పు అనేది జీవ చైతన్య కేతనం.

ఈ ప్రపంచంలో మారనిది ఏదీ లేదు. స్థిరంగా కనపడే భూమి కూడా తన చుట్టూ తాను తిరుగుతుంది. ప్రపంచంలో అన్నింటా మార్పు వస్తుంది. మనుషుల్లో కూడా చాలా మంది మారుతున్నారు.

మార్పు సహజమే కదా ! మరి కొందరు ఎందుకు మారరు ? మార్పు సాధ్యమే కదా ! ప్రయత్నమెందుకు చేయరు? భయం! భయం ! ఉన్నది. కూడా పోతుందేమో ? అనుకున్నది రాదేమోనన్న దిగులు. తనవల్ల సాధ్యం కాదేమో ? పరువు పోతుందేమో ? అందుకే చాలా మంది మార్పుని అంగీకరించరు.

  • వద్దు, కాదు, చాలు, అసాధ్యం, అమ్మో అంటారు. కానీ మార్పు అనివార్యం. అన్నిటా మార్పు వద్దన్నా వచ్చి తీరుతుంది. మార్పు వద్దంటే వెనుక నున్నవారు ముందుకు తోసుకుపోవడం ఖాయం.

గత అనుభవాల్ని పునాదులుగా చేసుకొని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వర్తమానాన్ని మీరు తీర్చిదిద్దుకోవలసిన అవసరం, సమయం ఆసన్నమయ్యాయి. సమయం సందర్భాలను బట్టి మనం మారాలి. మీకు ఉన్నా లేకపోయినా మార్పుకు సిద్ధపడండి. సమయం మన కొరకు ఆగదు. మారుతున్న కాలంతోపాటు నూతన పద్ధతులు క్రొత్త ప్రక్రియలు చేపట్టాలి.

  • ప్రతి మనిషి తన సమస్యల గురించి ఆలోచించకుండా వాటిని పరిష్కరించుకోవడానికి లేదా అసలు సమస్య రాకుండా జాగ్రత్తపడేలా తనను తాను మోటివేట్ చేసుకోవాలి. అంటే ప్రేరణ కలిగించుకోవాలి. కదలిక రావడమే ప్రేరణ. ప్రేరణ ఒక అలవాటుగా చేసుకోవాలి.
  • ఈనాడు ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు కూడా ప్రయోగశాలలో మొదటి సారే విజయవంతమవ్వలేదనే సత్యాన్ని గుర్తించండి. “నా ఖర్మ నా దురదృష్ట నా జాతకం, నా ఇంటి వాస్తు బాగాలేదు” వంటి డైలాగులు ప్రేరణకు అడ్డుగోడలని నమ్మండి.
  • మార్పు, కూర్పు, చేర్పు, నేర్పు, ఓర్పు, తీర్పు ఇవి ఆచరించినవారు ఏ రంగంలోనైనా విజయం సాధించటమే కాదు, విజయాన్ని అలవాటుగా మార్చుకొంటారు. * నీ ఆలోచనలను ఒక హారంగా కూర్చి పేర్చిన తరువాత దానికి
    అవసరమైన క్రొత్త అవకాశాలను చేర్చుకోవాలి. చెయ్యబోయే పనిని ఏ విధంగా ఏ పద్ధతిలో, ఏ కోణంలో చెయ్యాలో తగిన సలహాలను తీసుకోవాలి. నలుగురిని సంప్రదించి వారి అభిప్రాయాలను విశ్లేషించి చేర్చుకోవాలి.
  • మధ్యలో ఎదురయ్యే సమస్యలకు జడవక, బెదరక, అదరక, ముందుకు సాగాలంటే ఓర్పు చాలా అవసరం.
    సమయ పాలనల, సమయస్ఫూర్తి ,ఉంటే విజయం
    సాధించటంతో పాటు, వత్తిడి కూడా తగ్గించుకోవచ్చు.. * మీరు ఏ పని చేస్తున్నా మీకు ఆ పనిపట్ల శ్రద్ధ, ఏకాగ్రత అవసరం. మీరు చేయవలసిన పనిని ఎంజాయ్ చేయటం నేర్చుకోండి. వాటికనుగుణంగా మీ అలవాట్లను మార్చుకోండి.
  • కొన్ని సంస్థలలో పనులు పూర్తి చేయటానికి కొంత కాలం నిర్ణయిస్తారు. అయితే దానితో పని పూర్తవుతుందనుకుంటే పొరపాటు పడినట్లే.. ఎప్పటికప్పుడు తమ సిబ్బంది మెదడుకి పదును పెట్టే ప్రయత్నాలు చేస్తూ, అవసరమైన శిక్షణ ఇప్పిస్తూ, అన్నీ అందుబాటులో ఉంచగలిగితే అనుకున్న సమయానికి పని కావచ్చు.
  • మీరు చేస్తున్న పనులలో ఎంత సమయం వృధా చేస్తున్నారో.. గుర్తించండి. మీ పనులను ఒక ప్లాను ప్రకారం చెయ్యండి. సమయం, ఆదాయం, ఆరోగ్యం కాపాడుకుంటే శ్రమ, అలసటలకు వీడ్కోలు పలికి ప్రతి క్షణం ప్రశాంతంగా ఉండవచ్చు.
  • ప్రత్యర్థి వైభవాన్ని అసూయపడకుండా చూడగలిగినవాడు మంచి మనిషి .అలా చూసి ఆనందించగలిగేవాడు మంచి హృదయమున్న మనిషి.
  • వైఫల్యాలకు బెదరకండి. అవి నీలో నూతన శక్తిని కలిగించగలవు. అవి చక్కని పాఠం చెప్పగలవు. క్రొత్త క్రొత్త ఆలోచనలు రేకెత్తించగలవు. నీలో అనుకున్న మార్పు తీసుకురావటానికి దోహదపడగలవు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఎదుటివారికి అద్భుతమైన సలహాలు ఇవ్వగలరు. కానీ తన విషయంలో మాత్రము పప్పులో కాలేస్తూ,ఉంటారు. ఎదుటి వారికి చెప్పటానికే నీతులు ఉంటాయన్నట్లుగా
    ఉంటారు. తన విషయంలో తన వైఖరి ఏమిటో తనకే తెలియని అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుంటారు కొందరు.
  • ప్రతి వ్యక్తి తన వైఖరిని తాను విశ్లేషించుకోవాలి. తనలోని తెలివి తేటలను, బలహీనతలను, లోపాలను, అవకాశాలను, భయాలను, భ్రాంతులను తెలుసుకొని వాటిని విశ్లేషించి తన ప్రగతికి అవసర మయ్యే వాటిని పెంపొం దించుకొని తన అభివృద్ధికి ఆటంకంగా ఉన్న వాటిని విడిచి పెట్టాలి. ఇది ఎవరికి వారే చేసుకోవడం మంచిది.
    మార్పు అంటే ఉన్నది పోగొట్టుకోవడం అనే భావన నుండి బయటపడి, కొత్త వాటిని ఎలా గెలుచుకోవాలో అన్వేషించే మార్గమే మార్పు అని గ్రహించాలి.
  • సహజంగా చాలా మంది మార్పు గురించి చెప్పినపుడు, తమ వ్యవహారానికి ఎటువంటి ఢాకా లేదని, తమని ఎవరూ కదిలించలేరనీ, తమ శైలిని మించినది మరొకటి ఉండదనీ, ఏళ్ళ తరబడి అనుభవం. మేళవించిన పద్ధతి అని కొట్టిపారేస్తుంటారు. పాత పద్ధతులకు అలవాటు పడిపోయి, మార్పు వలన ప్రయోజనం ఉండదని తమని తాము మోసం చేసుకొంటూ, పరిణామ క్రమంలో వచ్చిన మార్పులను ఎదుర్కోలేక చివరకు చిక్కుల్లో పడతారు.
  • మీరు ఎంత పండితులైనా, కోర్సులు ఎన్ని చదివినా, ఒక్కసారి వివేకం, పట్టుదల, అవిశ్రాంత పోరాటం, భవిష్యత్తుని పసిగట్టే మనస్తత్వం ఉండకపోతే మనుగడ కష్టం.
  • పాత కొత్తల మధ్య అర్థవంతమైన వారధి ఎలా నిర్మించాలన్నదే మనిషికి
    ముఖ్యమైన ఆవేదన కావాలి. ఎందుకంటే అటు పాతవి గానీ, ఇటు కొత్తవి గానీ పూర్తిగా వదిలివేయడం అంత సమంజసం కాదు.
  • జీవితం ఎంతో విలువైనది. అందుకే జీవితంలోని ప్రతి క్షణాన్ని జాగ్రత్తగా గడుపుతుండాలి మనిషి ఎందుకంటే జీవితంలో మనిషి ఏదైనా కోల్పోవడానికి క్షణం పట్టదు. అయితే, దాన్ని తిరిగి
    సాధించడానికి మాత్రం ఎంత కాలమైనా సరిపోకపోవచ్చు. * జీవితంలో ముందుకు సాగే కొద్దీ మనిషి అప్పటిదాకా ఎంతో గొప్పవి అనుకున్న తన శక్తిసామర్థ్యాలకి వుండే పరిమితులని తెలుసు కొంటారు.
  • విజయం అనేది యాక్సిడెంటల్ రాదు. అదృష్టం కాదు. విజయానికి రహస్యం కృషి, దీక్ష, పట్టుదల, పరిశ్రమలతో గూడిన వైఖరి మాత్రమే: కారణమని అనుభవించిన వారికి తెలుసు.
  • స్వయంకృషితో పైకి రావడం వలన జీవితం విలువ తెలుస్తుంది. ఎటువంటి ఒడిదుడుకులనైనా తట్టుకోవచ్చు. ప్రసవం ఎంత బాధగా ఉన్నా, బిడ్డ జన్మించాక తల్లి పొందే ఆనందం అంతా ఇంతా కాదు. సముద్రంలో ఎన్ని ఆటుపోట్లు ఉంటే, నావికుడు అంత ప్రావీణ్యం పొందగలడు. విజయం సాధించాలనుకొనేవారికి మధ్యలో ఎటువంటి అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు, అదురుదెబ్బలు తగిలినా, అదరక బెదరక స్థిరంగా నిలబడితే వారికి విజయం తథ్యం. భయపడి పారిపోయే వారిని విజయం వరించదు.

రండి మారడానికి ప్రయత్నిద్దాం!!!

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles