Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

వక్ఫ్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన ఎస్‌జీపీసీ, అకల్ తఖ్త్, సిరోమణి అకాలీదళ్ సంస్థలు!

న్యూఢిల్లీ: వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లును పంజాబ్‌కు చెందిన అనేక ప్రముఖ సిక్కు సంస్థలు, పాంథిక్ పార్టీలు వ్యతిరేకించాయి. దేశవ్యాప్తంగా గురుద్వారాలను నిర్వహించే సిక్కుల అత్యున్నత సంస్థలుగా పేరుగాంచిన శిరోమణి అకాలీదళ్‌తో సహా మిగతా సంస్థలు బిల్లును ఖండించాయి. ఇది “ముస్లిం వ్యతిరేకమని” ప్రకటించాయి. వక్ఫ్‌ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లోక్‌సభలో జరిగిన చర్చలో శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, బిజెపి పార్టీ “మతం,కులం ఆధారంగా ప్రజలను విభజిస్తోంది” అని ఆరోపించారు. “వక్ఫ్ […]
Read more

మార్కెట్ల పతనంపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు…వాణిజ్య లోటు పరిష్కారమయ్యేవరకు సుంకాలు తగ్గించే ప్రసక్తే లేదన్న అమెరికా అధ్యక్షుడు!

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల కారణంగా వాల్ స్ట్రీట్‌లో గణనీయమైన నష్టాలను అమెరికా ఫ్యూచర్స్ సూచించాయి. ట్రంప్‌ టారిఫ్‌ల భయంతో నేడు ఆసియా స్టాక్ మార్కెట్లు బ్లడ్‌బాత్‌తో ప్రారంభమయ్యాయి, బొంబాయి స్టాక్‌ ఎక్స్చేంజీ భారీగా నష్టపోయి బ్లాక్‌మండేను తలపించింది. కాగా, పడిపోతున్న మార్కెట్ల గురించి ట్రంప్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు అనారోగ్యాన్ని బాగు చేసుకోవాలంటే చేదుగా ఉన్నా సరే మెడిసిన్ తీసుకోవాల్చి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇక, వాణిజ్య లోటు […]
Read more

గాజాలో ఇజ్రాయెల్ ఎడతెగని బాంబు దాడులు… బందీలకు ప్రమాదకరం అన్న హమాస్!

గాజా నగరం: ఇజ్రాయెల్‌ బాంబుదాడులతో గాజా ఉక్కిరిబిక్కిరవుతోంది. దాడులు ఇలాగే కొనసాగితే అక్కడ ఉన్న బందీలకు “చాలా ప్రమాదకరమైన” పరిస్థితిని సృష్టిస్తోందని హమాస్ తెలిపింది. జీవించి ఉన్న బందీలలో సగం మంది సైన్యం ఉన్న ప్రాంతాలలో ఉన్నారని మిలిటెంట్‌ సంస్థ ప్రతినిధి హెచ్చరించారు. “జీవించి ఉన్న ఇజ్రాయెల్ (బందీలు)లో సగం మంది… ఇజ్రాయెల్ సైన్యం ఇటీవలి రోజుల్లో ఖాళీ చేయమని కోరిన ప్రాంతాలలోనే ఉన్నారు” అని హమాస్ సాయుధ విభాగం ప్రతినిధి అబు ఒబెదా ఒక ప్రకటనలో […]
Read more

హైదరాబాద్‌ నగరాన్ని సందర్శించిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం!

హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కమిషన్ ఇటీవల హైదరాబాద్‌ను సందర్శించింది. ఇరు దేశాల మధ్య సాంకేతికతలు అందిపుచ్చుకోవడం, గ్రీన్‌ ఎకానమీ, మౌలిక సదుపాయాలలో ఆస్ట్రేలియా నైపుణ్య సామర్థ్యాలను ప్రదర్శించడమే లక్ష్యంగా ఈ బృందం పర్యటించింది. ఈ బృందంలో 13 సంస్థల నుండి 19 మంది సభ్యులు ఉన్నారు. ఆస్ట్రేలియన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కమిషన్ (ఆస్ట్రేడ్) నిర్వహించిన ఈ పర్యటన, రెండు వైపులా మార్కెట్ అవగాహనను పెంపొందించడం,ఆస్ట్రేలియన్, భారతీయ సంస్థలు, విశ్వవిద్యాలయాలు,కార్పొరేట్ ప్రొవైడర్ల మధ్య భాగస్వామ్యాలను […]
Read more

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం-మత స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులపై ప్రత్యక్ష దాడి…సయ్యద్ సాదతుల్లా హుస్సేనీ!

న్యూఢిల్లీ : లోక్‌సభలో వక్ఫ్ సవరణ చట్టం 2025 ఆమోదం పొందడాన్ని జమాతే-ఇ-ఇస్లామి హింద్ (JIH) అధ్యక్షుడు సయ్యద్ సాదతుల్లా హుస్సేనీ తీవ్రంగా ఖండించారు, దీనిని మత స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులపై స్పష్టమైన దాడి అని అభివర్ణించారు. ఈ చట్టం ఆమోదం వివక్షతతో కూడుకున్నది, ఎందుకంటే ఇది ముస్లింలు తమ మతపరమైన ఆస్తులను నిర్వహించడంలో స్వయంప్రతిపత్తిని హరింపజేస్తుంది, అయితే ఇతర వర్గాల మతపరమైన ట్రస్టులు మాత్రం ప్రభావితం కావు. అంతేకాదు ‘వక్ఫ్ చట్టం 1995’లో భారీ మార్పులను […]
Read more

విద్యా వ్యవస్థ బలోపేతానికి కొత్త రోడ్‌మ్యాప్‌…సీఎం రేవంత్‌రెడ్డి!

హైదరాబాద్: ప్ర‌స్తుత విద్యా వ్య‌వ‌స్థ‌లో లోపాలు, తీసుకురావ‌ల్సిన సంస్క‌ర‌ణ‌ల‌పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఆచరణీయమైన పాలసీని సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి విద్యా కమిషన్‌ను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ… క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా, ఆచరణ సాధ్యంగా పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు ప్రారంభించిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వీటిలో […]
Read more

పార్లమెంట్‌లో అర్థరాత్రి దాటాక ఆమోదం పొందిన వక్ఫ్‌ బిల్లు… భూ కబ్జాకు రాజమార్గమని అభివర్ణించిన విపక్షాలు!

న్యూఢిల్లీ: వరుసగా రెండవ రోజు, పార్లమెంటు అర్ధరాత్రి దాటాక కూడా పనిచేసింది, రాజ్యసభ 2025 వక్ఫ్ సవరణ బిల్లును తెల్లవారుజామున 2.35 గంటలకు రాజ్యసభ చట్టానికి అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లతో ఆమోదం పొందింది. ఏప్రిల్ 3న తెల్లవారుజామున 2 గంటలకు బిల్లును ఆమోదించిన లోక్‌సభతో పోలిస్తే ఎగువ సభ కొద్ది ఎక్కువ సమయం తీసుకుంది. బిల్లుకు నిరసనగా అనేక మంది ప్రతిపక్ష సభ్యులు నల్ల దుస్తులు ధరించి పార్లమెంటుకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ, […]
Read more

గాజా పిల్లలకు ప్రాణసంకటంగా మారిన పేలని బాంబులు!

జెరూసలేం: యుద్ధం కారణంగా శిధిల నగరం గాజా పేలని బాంబులతో నిండిపోయింది. వాటిని తొలగించడానికి సంవత్సరాలు పడుతుంది, లోహపు కేసింగ్‌లతో ఈ బాంబులు పిల్లలన అమితంగా ఆకర్షిస్తున్నాయి. వాటిని తీయడానికి ప్రయత్నించినప్పుడు అవి పేలి చిన్నారులు వికలాంగులుగా మారుతున్నారు. లేదంటే మరణించడం సంభవిస్తుందని ఒక మందుపాతర నిర్మూలన నిపుణుడు వార్తా సంస్థతో చెప్పారు. ఈ సందర్భంగా యుకె మాజీ సైనిక మందుపాతర నిర్మూలన నిపుణుడు మాట్లాడుతూ… యుద్ధంలో దెబ్బతిన్న పాలస్తీనా భూభాగానికి ఒక మిషన్ తర్వాత “ప్రస్తుతం […]
Read more

వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇచ్చిన జేడీయూ… పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత మహమ్మద్ ఖాసిం!

న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని పార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ ఖాసిం అన్సారీ రాజీనామా చేశారు, వక్ఫ్ సవరణ బిల్లుకు పార్టీ మద్దతు ఇవ్వడంతొ తాను వైదొలగానని ఆయన స్పష్టం చేశారు. నితీష్ కుమార్‌కు రాసిన రాజీనామా లేఖలో, వక్ఫ్ అంశంపై జెడి(యు) వైఖరిపై అన్సారీ తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు, ఈ బిల్లు పార్టీ సూత్రాలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా తన యావత్‌ జీవితాన్ని పార్టీకి అంకితం చేసానని, అయితే ఈ […]
Read more

వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న డీఎంకే!

చెన్నై: కేంద్రం ప్రతిపాదించిన వక్ఫ్ (సవరణ) బిల్లు 2025కి వ్యతిరేకంగా ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకమని…. బిల్లు ఆమోదం పొందడాన్ని నిరసిస్తూ నల్ల రిబ్బన్ ధరించిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, వక్ఫ్ ఆస్తుల విషయంలో బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమిళనాడు పోరాడుతుందని, అందులో విజయం సాధిస్తుందని అసెంబ్లీలో అన్నారు. “భారతదేశంలోని మెజారిటీ రాజకీయ పార్టీలు వక్ఫ్ (సవరణ) బిల్లును వ్యతిరేకించాయి. దాని […]
Read more
1 … 236 237 238 239 240 … 256

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.