25.7 C
Hyderabad
Saturday, May 18, 2024

‘అరబ్బుల నుంచి ఏమీ ఆశించవద్దు’… హనీయా కోడలి ఆవేదన!

పాలస్తీనా: ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత మధ్య ప్రాచ్యంలో యుద్ధవాతావరణాన్ని తలపిస్తోంది. ఆకలి దప్పుల మధ్యే బుధవారం  పాలస్తీనియన్లు ఈద్ పండుగను జరుపుకున్నారు,  అదే రోజున, ఇజ్రాయెల్ దమనకాండలో  హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియెహ్ ముగ్గురు కుమారులు, ముగ్గురు మనవరాళ్లు చనిపోయారు.   గాజాలోని అల్-షతీ క్యాంప్ వద్ద జరిగిన బాంబు దాడిలో వీరంతా ప్రాణాలు కోల్పోయారు.

అల్-జజీరా ప్రకారం, ఈద్ అల్-ఫితర్ సందర్భంగా కుటుంబ సభ్యులను అభినందించడానికి కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు మరణించారు. డ్రోన్ ద్వారా ప్రయోగించిన క్షిపణితో దాడి జరిగింది, అది నేరుగా కారును లక్ష్యంగా చేసుకుంది, అందులో ఉన్న ప్రతి ఒక్కరినీ చంపింది, స్వల్పంగా గాయపడిన అల్-అహ్లీని బాప్టిస్ట్ ఆసుపత్రికి తరలించారు.

తీవ్ర పగ, ప్రతీకారాలతో తన ముగ్గురు పిల్లలను మరో ముగ్గురు మనవళ్లను ఇజ్రాయేల్‌ అత్యంత దారుణంగా హత్య చేసిందని ఇస్మాయిల్‌ హనియా ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.

అంతర్జాతీయ చట్టాలను, విలువలను ఇజ్రాయేల్ ఏ మాత్రం పట్టించుకోలేదని, కిరాతకంగా వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. జెరూసలెం, అల్‌ అక్సా మసీదును విముక్తి చేసే మార్గంలో తన కుమారులు హజెమ్, అమిర్, మొహ్మద్ అమరులయ్యారని అల్‌ జజీరా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. తన పిల్లలను హత్య చేసినంత మాత్రాన పాలస్తీనా విషయంలో తన వైఖరి మారబోదని ఆయన స్పష్టం చేశారు.

‘నా కొడుకుల రక్తం మన ప్రజల రక్తం కంటే విలువైంది కాదు’ అని అన్నారు. ఇస్మాయిల్ హనీయే గత కొన్నేళ్లుగా ఖతార్‌లో ప్రవాస జీవితం గడుపుతున్నారు. గత నవంబరులో గాజాపై ఇజ్రాయేల్ వైమానిక దాడిలో అతడి ఇళ్లు ధ్వంసమైంది.

అక్టోబరు 7న ఇజ్రాయేల్‌పై హమాస్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయేల్ యుద్ధం ప్రకటించింది. మరోవైపు, ఇజ్రాయేల్ కాల్పుల విరమణ ప్రతిపాదనను అధ్యయనం చేస్తున్నామని, అయితే తమ డిమాండ్‌లలో దేనినీ నెరవేర్చలేదని హమాస్ మంగళవారం తెలిపింది.

హమాస్ చీఫ్‌గా ఇస్మాయల్ హనీయే 2017లో నియమితులయ్యాడు. అప్పటి నుంచి టర్కీ, ఖతార్‌లో తలదాచుకుంటున్నాడు. తాజాగా కాల్పుల విరమణ చర్చల్లో పాల్గొనడానికి వీలుగా ఇజ్రాయేల్ ఆయనపై ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేసింది. హమాస్ నాయకత్వాన్ని తీవ్రవాదులుగా పరిగణిస్తోన్న ఇజ్రాయేల్.. హనియే, ఇతర నాయకులు ఆ సంస్థలను నడిపిస్తున్నారని ఆరోపిస్తోంది.

ఇస్మాయిల్ హనీయే కుమారుడు హజెమ్‌ను కోల్పోయిన భార్య.. ‘అరబ్బుల నుంచి ఏమీ ఆశించవద్దు’ అని సామాజిక మాధ్యమాల్లో విజ్ఞప్తి చేసింది. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

హజెమ్ భార్య తన శక్తివంతమైన సందేశం ఇలా పేర్కొంది.

“అమరవీరులందరికీ మీ శుభాకాంక్షలు తెలియజేయండి” అని హజెమ్ భార్య తన భర్త, పిల్లలకు వీడ్కోలు పలికింది. “మేము సహనం వహించాము. నేను నిన్ను అల్లాహ్‌కు అర్పించాను. నా దృష్టిలో “హజెమ్ చనిపోలేదు, అతను అమరుడు. మా ఆయన్ని చంపడంలో ఇజ్రాయెలీలు విఫలమయ్యారు ”ఆమె తన సందేశంలో పేర్కొంది.

ఆరు నెలలుగా ఇజ్రాయోల్ మాపై మారణహోమం కొనసాగిస్తున్నప్పటికీ, గాజా ప్రజలకు ఎటువంటి మద్దతు ఇవ్వని అరబ్ దేశాలకు ఆమె సందేశం సూటిగా తాకినట్టు ఉందని వార్తాసంస్థలు పేర్కొంటున్నాయి. “ఎవరూ అరబ్బులకు విజ్ఞప్తి చేయకూడదు. మాకు వాది అవసరం లేదు. వారు చనిపోయినవారు” అంటూ తన భర్త, పిల్లల శరీరాలను హత్తుకుని రోదించింది.

అబూ అమ్ర్ (ఆమె భర్త) అల్లా మీపై దయ చూపుగాక,” అని ఆమె తన హత్యకు గురైన భర్తకు చివరి సందేశం పంపుతూ “మీ ఈద్ స్వర్గంలో ఉంది” అని ముగించింది.

అరబ్ నియంతల మద్దతుతో US-UK, ఫ్రాన్స్, జర్మనీ, ఇజ్రాయెల్ 8 అక్టోబర్ 2023న గాజాలో పాలస్తీనియన్లపై మారణహోమం ప్రారంభించినప్పటి నుండి కనీసం 33,634 మంది పాలస్తీనియన్లు మరణించారు, 76,214 మంది గాయపడ్డారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles