32.2 C
Hyderabad
Saturday, May 18, 2024

బ్రెజిల్‌లో భారీ వరదలు… 78 మంది దుర్మరణం!

పెట్రోపోలిస్ (బ్రెజిల్): బ్రెజిల్ దేశంలో సంభవించిన మెరుపు వరదల్లో 78 మంది దుర్మరణం చెందారు. భారీవర్షాల వల్ల బ్రెజిల్ దేశంలోని పెట్రోపోలిస్ నగరంలోని వీధులు నదులుగా మారాయి. వరదనీటి ధాటికి చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. తుపాన్ ప్రభావం వల్ల ‘రియో డి జనీరో’కు ఉత్తరాన ఉన్న హిల్స్ లోని సుందరమైన పట్టణంపై వరదనీరు వెల్లువెత్తింది. వరదల్లో పలువురు కొట్టుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు బురదలో కూరుకుపోయిన మృతదేహాలను వెలికితీస్తున్నారు. వరద బాధితులను సహాయ శిబిరాలకు తరలించి వారికి ఆహారం, నీరు, దుస్తులు, ఫేస్ మాస్కులు ఇచ్చారు. భారీ వరదల్లో నగరంలోని కార్లు, చెట్లు కొట్టుకుపోయాయి. అగ్నిమాపక సిబ్బంది, స్వచ్ఛంద రెస్క్యూ వర్కర్లు మట్టి ప్రవాహాలలో కొట్టుకుపోయిన ఇళ్ల శిధిలాలను తవ్వితే  మరణాల సంఖ్య మరింత పెరుగుతుందని భయాలు ఉన్నాయి, వరద ఉధృతిలో కొట్టుకుపోయిన ఇళ్లన్నీ కొండ ప్రాంతాల మురికివాడల్లో ఉన్నాయి. వరదల్లో గల్లంతైన వారికోసం సైనికులు, సహాయక సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 22 మందిని ప్రాణాలతో రక్షించామని వెల్లడించారు. మృతులసంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెప్పారు. మూడు నెలల్లో పడాల్సిన వర్షం మూడు గంటల్లోనే కురిసిందని పేర్కొన్నారు.  దాదాపు 300 మందిని షెల్టర్లలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. బాధితుల కోసం పరుపులు, దుప్పట్లు, ఆహారం, నీరు, దుస్తులు మరియు ముఖానికి మాస్క్‌లు విరాళంగా ఇవ్వాలని స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చాయి. బ్రెజిల్ లోని పెట్రోపోలిస్ నగరంలో కేవలం మూడు గంటల్లో 258 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని మేయర్ కార్యాలయం తెలిపింది. డిసెంబరు నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బ్రెజిల్ అతలాకుతలం అవుతోంది. గత నెలలో కుండపోత వర్షం, వరదల వల్ల కొండచరియలు విరిగిపడటంతో ఆగ్నేయ బ్రెజిల్‌లో 28 మంది మరణించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles