28.2 C
Hyderabad
Saturday, May 18, 2024

మోదీ ప్రభుత్వం తాము ఎంపిక చేసుకున్న 20-25 మంది కోసమే పనిచేస్తోంది… రాహుల్ గాంధీ!

బెంగళూరు: భారతీయ జనతా పార్టీపై   కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.  మోదీ సర్కార్ 20-25 మంది ఎంపిక చేసిన వ్యక్తుల’ కోసం ప్రభుత్వాన్ని నడుపుతుందని, అయితే తమ పార్టీ మాత్రం బడుగు బలహీనవర్గాలు, రైతులతో సహా ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని చూస్తుందని అన్నారు.

కర్నాటకలోని మాండ్యాలో జరిగిన భారీ బహిరంగ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. “రాబోయే ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య పోరు. మేము (కాంగ్రెస్) పేదలు, రైతులు, మహిళలు, కార్మికులు, వ్యాపారవేత్తల కోసం ప్రభుత్వాన్ని నడుపుతున్నాము…అయితే వారు (బీజేపీని ఉద్దేశించి) 20 నుండి 25 మంది ఎంపిక చేసిన వ్యక్తుల కోసం ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఎద్దేవా చేశారు.

మన దేశానికి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అందించిన కాంగ్రెస్‌ ఒకవైపు, మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ… ప్రజాస్వామ్యాన్ని తుదముట్టించి దేశంలోని ప్రతి సంస్థలోనూ తమ వ్యక్తులను ప్రతిష్ఠిస్తున్నారని ఆయన ఆరోపించారు.

కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే కొన్ని కీలక చర్యలు తీసుకుంటామని వాయనాడ్ ఎంపీ చెప్పారు.

”రైతుల రుణాలను మాఫీ చేసేందుకు కృషి చేయడంతో పాటు రైతులకు చట్టబద్ధంగా  కనీస మద్దతు ధర ఇవ్వబడుతుంది. బీమా క్లెయిమ్‌లు 30 రోజుల్లో పరిష్కరిస్తామని ఆయన చెప్పారు.

“నేడు, కర్ణాటకలో, మహిళలకు ప్రతి నెల రూ. 2,000 ఇస్తున్నాం.  మహిళలు దేశ భవిష్యత్తును, భవిష్యత్తు తరాలను చూసుకుంటారు. పురుషుడు ఎనిమిది గంటలు పనిచేస్తే స్త్రీలు 16 గంటలు పని చేస్తారు. ఈ దిశలో, ఏటా, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం కుటుంబంలోని ఒక మహిళ ఖాతాలో రూ. 1 లక్ష జమ చేస్తుంది, ”అని కాంగ్రెస్ నేత రాహుల్ చెప్పారు.

కర్ణాటకలో ర్యాలీని ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ“మీకు ఇప్పుడు సంవత్సరానికి 24,000 రూపాయలు లభిస్తున్నాయి. ఎన్నికల తర్వాత మా ప్రభుత్వం రాబోతోందని, మీ ఖాతాల్లోకి రూ.1.24 లక్షలు జమచేస్తామన్నారు. ప్రతి పేద కుటుంబానికి వారి ఖాతాల్లోకి ప్రతి నెలా రూ.10,500 జమ అవుతుంది. ఇది కోట్లాది కుటుంబాల జీవితాలను మారుస్తుంది.  ఇది ఒక విప్లవాత్మక అడుగు కానుందని రాహుల్ అన్నారు. .

‘‘కనీస వేతనంగా రూ.400 నిర్ణయించబోతున్నాం.” “గత ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేము ఐదు హామీలు ఇచ్చామని మీకు గుర్తుండే ఉంటుంది. అన్ని వాగ్దానాలు నెరవేరినందుకు సంతోషంగా ఉందని రాహుల్ గాంధీ అన్నారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మాండ్య నుంచి వెంకటరమణెగౌడను కాంగ్రెస్ బరిలోకి దింపింది.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles