26.2 C
Hyderabad
Saturday, May 18, 2024

మెడిసిన్ చదవడం కోసం ఉక్రెయిన్‌కు ఎందుకు వెళ్తారు? కారణాలు ఇవే

ఉక్రెయిన్ పేరు వింటే యుద్ధం కళ్ల ముందు కనిపిస్తుంది కానీ… వైద్య విద్య కోసం ఉక్రెయిన్ (Medicine in Ukraine) వెళ్లే విద్యార్థుల సంఖ్య ఎక్కువ. ఉక్రెయిన్‌లో మెడిసిన్‌కు ప్రత్యేకత ఏంటీ? ఎందుకు ఇండియా నుంచి వేలాది మంది వైద్య విద్యను అభ్యసించేందుకు ఉక్రెయిన్ వెళ్తున్నారు? తెలుసుకోండి.

ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ ఆపరేషన్ కొనసాగుతోంది. ఉక్రెయిన్‌లో 18,000 పైగా భారతీయ విద్యార్థులు (Indian Students in Ukraine) చిక్కుకున్నారన్న వార్తలు వస్తున్నాయి. వారిలో తెలుగు విద్యార్థులు (Telugu Students in Ukraine) కూడా ఉన్నారు. తెలుసు విద్యార్థులు సుమారు 1500 నుంచి 3000 మధ్య ఉన్నారన్న వార్తలొస్తున్నాయి. వారంతా భారతదేశానికి తిరిగి వచ్చేందుకు ఇక్కడి ప్రభుత్వ సాయం కోరుతున్నారు. భారత ప్రభుత్వం కూడా విద్యార్థులను వెనక్కి తీసుకువచ్చేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటోంది. ఉక్రెయిన్‌కు వెళ్లిన విద్యార్థుల్లో ఎక్కువ మంది అక్కడ మెడిసిన్ చదవడానికి వెళ్లినవారే. మిగతావారు ఇంజనీరింగ్ కోసం వెళ్తుంటారు. అయితే అమెరికా, ఆస్ట్రేలియా, చైనా లాంటి దేశాలు ఉండగా ఉన్నత విద్య కోసం ఉక్రెయిన్‌కు ఎందుకు వెళ్లారన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో ఈ టాపిక్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఉక్రెయిన్‌లోని మెడికల్ కాలేజీల్లో మెడిసిన్ కోర్సులు చదువుతున్నవారిలో భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఉంటారు. తక్కువ మందే ఇంజనీరింగ్ కోర్సులు చేస్తుంటారు. ఉక్రెయిన్ రాజధానికి కీవ్‌కు 480 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్కీవ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలోనే మెడిసిన్ కోర్సుల్లో చేరినవారు ఎక్కువ. ఉక్రెయిన్‌లోని మెడికల్ కాలేజీలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) గుర్తింపు ఉంది. అక్కడి కాలేజీల్లో చదివిన డిగ్రీలు భారతదేశంలో చెల్లుతాయి. ఆ కోర్సుల్ని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ గుర్తించింది.
కర్నాటకలోని రాయిచూర్ జిల్లా దేవసుగురు గ్రామానికి చెందిన చెన్నవీరేష్ కూడా ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ కోర్సులో చేరేందుకు 2021 అక్టోబర్ 4న అక్కడి వెళ్లారు. అతని తండ్రి రైతు. ఆరేళ్ల తర్వాత అతను డాక్టర్ అయి వస్తాడని వారంతా కలలు కంటున్నారు.
“అతనికి ఇంటర్మీడియర్‌లో మంచి మార్కులు వచ్చాయి. అతని సీనియర్ కూడా ఉక్రెయిన్ వెళ్లారు. అతని గైడెన్స్‌తోనే మా అబ్బాయి కూడా ఉక్రెయిన్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నాడు. చెన్నవీరేష్ నా చిన్నకొడుకు. అతను చదువుకోవడానికి ఉక్రెయిన్ వెళ్తానని అడిగితే అందుకు మేం అంగీకరించాం”
— సాంబశివ, చెన్నవీరేష్ తండ్రి
ఇప్పుడు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వేలాది భారతీయ విద్యార్థుల్లో చెన్నవీరేష్ కూడా ఒకరు.
“కాలేజీలో చేరడం అంత కష్టమేమీ కాలేదు. నాకు ఇంటర్మీడియట్‌లో 73 శాతం మార్కులు వచ్చాయి. నీట్‌లో 370వ ర్యాంక్ వచ్చింది. ఉక్రెయిన్‌లో బేసిక్ ఎంట్రెన్స్ టెస్ట్ ఉంటుంది. ఈజీగానే పాస్ అయ్యాను. నేను ఖర్కీవ్ నేషనల్ మెడికల్ కాలేజ్‌లో చదువుతున్నాను. ఏడాదికి రూ.5 లక్షలు ఖర్చవుతుంది. ఇందులోనే కాలేజీ ఫీజులు, హాస్టల్ ఖర్చులు, ఇతర ఖర్చులు ఉంటాయి. ఇక్కడ ఎక్కువ ఖర్చు చేసే విద్యార్థులు కూడా ఉన్నారు. కానీ ఈమాత్రం డబ్బులు సరిపోతాయి. ఈ కోర్సులో మా వ్యక్తిగత కృషి ఎక్కువగా ఉంటుంది. ఇంగ్లీష్‌లో బోధన ఉంటుంది. నేర్చుకోవడం కష్టమేమీ కాదు. కర్నాటకతో పాటు భారతదేశం నుంచి చాలామంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు.”
ఇక పూరణ్ చంద్రశేఖర్ కర్నాటక నుంచి ఉక్రెయిన్ వెళ్లిన మరో విద్యార్థి. బెంగళూరులోని సుంకడకట్టెలో అతని తల్లిదండ్రులు చంద్రశేఖర్, రాజేశ్వరి నివసిస్తున్నారు. విజయనగర్‌లోని ఏఎస్‌సీ కాలేజీ నుంచి ఇంటర్మీడియట్‌లో పూరణ్ 95 శాతం మార్కులతో పాస్ అయ్యాడు. నీట్‌లో క్వాలిఫై అయ్యాడు. కానీ కరోనా వైరస్ మహమ్మారితో ఒక ఏడాది కోల్పోతానన్న భయంతో ఉక్రెయిన్ వెళ్లాడు.
పూరణ్ ఆర్మీలో చేరాలని చిన్ననాటి నుంచి అనుకుంటున్నాడు. కానీ శారీరకంగా దృఢంగా లేడు. అందుకే మెడిసిన్ చదివి, స్పెషలైజేషన్ చేసి ఆర్మీలో చేరాలనుకున్నాడు. తన లక్ష్యం విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాడు. నా భర్త ఓ మల్టీ నేషనల్ కంపెనీలో సీనియర్ పొజిషన్‌లో ఉన్నారు. ఉక్రెయిన్ గురించి ఆరు నెలల పాటు లోతుగా పరిశోధన చేశాం. అక్కడ పూరణ్ ఉన్నత విద్య బాగుంటుందని నిర్ణయించుకున్నాం. అక్కడ తక్కువ ఖర్చుకే నాణ్యమైన చదువు లభిస్తుంది. నిన్నటి వరకు మేమంతా సంతోషంగానే ఉన్నాం.”
— రాజేశ్వరి, పూరణ్ తల్లి
వీళ్లలాగే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఉన్నత విద్య కోసం ఉక్రెయిన్‌కు పంపారు. అక్కడ రెసిడెన్షియల్ కార్డ్, వీసా, ఏజెన్సీ ఫీజు, ప్రయణా ఖర్చులు, వసతి లాంటి ఖర్చులన్నీ మొదటి ఏడాది కలిపి రూ.13 లక్షల నుంచి రూ.14 లక్షలు ఖర్చవుతుంది. రెండో ఏడాది నుంచి రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలు ఖర్చవుతుంది. మెడికల్ విద్యార్థులు అక్కడే మాస్టర్స్ చదివేందుకు 10 ఏళ్ల వీసా ప్లాన్ చేసుకుంటారు. ఉక్రెయిన్‌లో కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ పేరుతో ఉన్న నేషనల్ ఎగ్జిట్ టెస్ట్‌కు (NEXT) హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇండియాలో ప్రాక్టీస్ చేయొచ్చు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles