26.2 C
Hyderabad
Saturday, May 18, 2024

సామాన్యుల నెత్తిన గుదిబండ.. రాత్రికిరాత్రే ఈ మూడింటి ధరల పెంపు!

మోదీ సర్కార్ సామాన్యులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచే ఈ కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. దేని దేని ధరలు ఎంత స్థాయిలో పెరిగాయో ఒకసారి తెలుసుకుందాం.

ప్రధానాంశాలు:

సాధారణ ప్రజలకు కేంద్రం ప్రభుత్వం బ్యాడ్ న్యూస్
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సర్కార్

అలాగే గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరిగాయి

ఈరోజు నుంచే ధరల పెంపు నిర్ణయం అమలులోకి వచ్చింది.

కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఒకే రోజు పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న ప్రజలపై తాజా ధరల పెంపు నిర్ణయంతో మరింత ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగింపు తర్వాత పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు ఉంటుందని మనం ముందుగానే చెప్పుకున్నాం. అనుకున్నట్లుగానే మోదీ సర్కార్ ఇప్పుడు ధరలు పెంచేసింది.

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పైకి కదలడం. క్రూడ్ రేట్లు కదలికలు నేరుగానే ఇంధన ధరలు, వంట గ్యాస్ ధరలపై ప్రభావం చూపుతాయి. అలాగే అమెరికా డాలర్‌తో ఇండియన్ రూపాయి మారక విలువ కూడా ఈ ధరలను ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల తగ్గినట్లే తగ్గి మళ్లీ ధరలు పైకి కదులుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఈరోజు 2 శాతానికి పైగా పెరిగాయి. 118 డాలర్ల పైన కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలు పెంచేశాయి. తాజా ధరల పెంపు ప్రకారం చూస్తే.. హైదరాబాద్‌లో మంగళవారం పెట్రోల్ ధర 80 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ ధర లీటరుకు రూ. 109కు చేరింది. డీజిల్ రేటు కూడా ఇదే దారిలో నడిచింది. డీజిల్ ధర లీటరుకు 80 పైసలు పైకి చేరింది. దీంతో దీని రేటు రూ. 95.42కు ఎగసింది. గుంటూరు అమరావతిలో కూడా పెట్రోల్ ధర ఇదే దారిలో నడిచింది. పెట్రోల్ రేటు లీటరుకు 80 పైసలు పెరిగింది. రూ. 111.47కు చేరింది. డీజిల్ రేటు కూడా ఇదే స్థాయిలో పెరిగింది. దీంతో డీజిల్ ధర రూ. 96.88కు ఎగసింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం చాలా నెలల తర్వాత అంటే దాదాపు 137 రోజుల (2021 నవంబర్ 2 నుంచి చూస్తే ఫస్ట్ టైమ్) తర్వాత ఇదే తొలిసారి.

అలాగే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ.50 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధరకు ఈ పెంపు వర్తిస్తుంది. మార్చి 22 నుంచే రేట్ల పెంపు నిర్ణయం అమలులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. కాగా చివరిగా 2021 అక్టోబర్ నెలలో గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. అప్పటి నుంచి వంట గ్యాస్ ధర నిలకడగానే వచ్చింది.

హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.1,002కు చేరింది. దీనికి డెలివరీ బాయ్స్ తీసుకునే రూ.30 కలుపుకుంటే సిలిండర్ ధర రూ.1032 అయ్యిందని చెప్పుకోవచ్చు. అలాగే ఏపీలో అయితే సిలిండర్ ధర రూ.1008కు చేరింది. దీనికి డెలివరీ బాయ్స్ తీసుకనే చార్జీలు కలుపుకుంటే సిలిండర్ పొందాలంటే రూ.1040 చెల్లించాల్సి ఉంటుంది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరను రూ.1000 పైకి తీసుకెళ్లింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles