26.2 C
Hyderabad
Saturday, May 18, 2024

రంజాన్ సందర్భంగా హైదరాబాద్‌లోని మార్కెట్లు 24 గంటలు పనిచేసే అవకాశం!

హైదరాబాద్‌: రంజాన్‌ మాసం కోసం ముత్యాల నగరం హైదరాబాద్ సిద్ధమవుతోంది. పాతనగరం రంజాన్‌ మాసం సందర్భంగా నగరంలోని మార్కెట్లు 24 గంటలపాటు నడిచే అవకాశం ఉంది. అధికారిక వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం… రాత్రిపూట దుకాణాలు, ఇతర సంస్థలు తెరిచేందుకు వీలుగా కార్మిక శాఖ అనుమతిని మంజూరు చేయనుంది.

హోటళ్లు, తినుబండారాలు, దుకాణాలు వంటి సంస్థలు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కార్మిక శాఖకు ఇప్పటికే వినతిపత్రం కూడా సమర్పించారు.

త్వరలో అనుమతి జారీ చేయనున్నారని,  పవిత్ర మాసంలో ఈ సంస్థలు తెరిచి ఉండవచ్చని సమాచారం. అయితే, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన వెంటనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ హైదరాబాద్‌లోని 24 గంటల మార్కెట్‌పై కొన్ని షరతులు పెట్టే అవకాశం ఉంది.

అదనపు గంటల పని కోసం యాజమాన్యం ఉద్యోగులకు ఓవర్ టైం చెల్లింపును అందించాల్సి ఉంటుంది.

24 గంటలపాటు మార్కెట్లు తెరి నిజంగా వ్యాపారులకు ఈ రంజాన్‌ మాసంలో ఓ వరంలా మారనుంది. ” రంజాన్ మాసంలో రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి.. 24 గంటల సదుపాయం ిఇటు వ్యాపారులకు, అటు వినియోగదారులకు ఉపయోగపడుతుంది. ప్రజలు తమ ప్రార్థనలకు భంగం కలగకుండా.. షాపింగ్ కోసం ఏ సమయంలోనైనా వచ్చేందుకు వీలు కల్పించినట్లు అవనుంది.

ఎక్కడెక్కడ ఏమేమి లభిస్తాయంటే.. గుల్జార్ హౌజ్ మార్కెట్‌లో అత్యంత ఖరీదైన ముత్యాల నుంచి సేఫ్టీ పిన్‌ల వరకు.. ప్రతి చిన్న వస్తువులను కొనుగోలు చేయవచ్చు. మదీనా బిల్డింగ్, మొఘల్‌పురా మధ్య  పాదరక్షలు, గృహోపకరణాలు, దుస్తులు, పెళ్లి దుస్తులు, సంప్రదాయ దుస్తులు, క్యాప్స్, బ్యాంగిల్స్, ఇతర వస్తువులు లభిస్తాయి. “ఇఫ్తార్ సమయంలో, షాప్ కీపర్లు.. కస్టమర్లు తమ ‘రోజా’ను విరమించేందుకు వీలుగా పండ్లను అందించడం ఓ రివాజుగా మారింది.

పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు…

ప్రజల రద్దీని దృష్టిలో పెట్టుకుని వ్యాపార సముదాయాలు, రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కఠినతరం చేశారు. వాహనాలు ఎక్కడపడితే అక్కడ ఆపకుండా.. పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేయనున్నారు. పోలీసులు జీహెచ్‌ఎంసీ సమన్వయంతో పాతబస్తీ మార్కెట్‌కు షాపింగ్‌ చేసేందుకు వచ్చే వారి కోసం వాహనాల పార్కింగ్‌ ఏర్పాట్లు చేస్తారు. చార్మినార్ నిజామియా హాస్పిటల్, ముఫీదుల్ అనమ్ స్కూల్, అలీజా కోట్లా, సర్దార్ మహల్ కాంప్లెక్స్, మోతీ గల్లి పాత ఆఫీస్, ఉర్దూ మస్కాన్ ఆడిటోరియం ఖిల్వత్, ఎస్‌వైజే కాంప్లెక్స్ ఫతేరగట్టి, QQSUDA స్టేడియం, హైకోర్టు రోడ్, పాత బస్టాండ్ చార్మినార్ కాంప్లెక్స్, మొత్తిగుల్లి ఖానా వంటి ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసే అవకాశముంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles