26.2 C
Hyderabad
Saturday, May 18, 2024

అదరగొట్టిన తెలంగాణ.. దేశంలోనే అత్యధిక వృద్ధిరేటు నమోదు

సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ), తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం కనివినీ ఎరుగని వృద్ధిరేటు నమోదు చేసింది. ఈ జాబితాలో దేశంలోనే అత్యధిక వృద్ధిరేటు నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచింది.

తెలంగాణ వృద్ధిరేటు భారీగా పెరుగుదల

తలసరి ఆదాయం రూ. 2,78,833

జీఎస్‌డీపీ రూ. 11,54,860 కోట్లు

2021-22 గణాంకాలను విడుదల చేసిన కేంద్రం

2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ), తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం రికార్డు స్థాయి వృద్ధి రేటు నమోదు చేసింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జీఎస్‌డీపీ, తలసరి ఆదాయంలో ఇంత భారీగా వృద్ధిరేటు నమోదు కావడం ఇదే తొలిసారి. జీఎస్‌డీపీలో 19.46 శాతం నమోదు చేయగా తలసరి ఆదాయంలో దేశంలోనే అత్యధికంగా 19.10 శాతం వృద్ధిరేటును నమోదు చేయడం విశేషం. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ (ఎంఓఎస్‌పీఐ) సోమవారం ఈ లెక్కలను అధికారికంగా విడుదల చేసింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ జీఎస్‌డీపీని ప్రస్తుత ధరల్లో రూ. 1,154,860 కోట్లుగా, తలసరి ఆదాయాన్ని రూ. 2,78,833గా కేంద్రం నిర్ధారించింది. కరోనా పరిస్థితుల కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌డీపీ వృద్ధిరేటు 2.25 శాతం మాత్రమే నమోదు కాగా.. ఈసారి ఏకంగా 19.46శాతంగా అంటే గతేడాది కంటే 16.85 శాతం అధిక వృద్ధిరేటును సాధించడం విశేషం. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయంలో వృద్ధిరేటు 2020-21 కంటే కంటే 17.14 శాతం ఎక్కువ సాధించింది. తెలంగాణ తలసరి ఆదాయం 2014-15లో రూ.1,24,104గా ఉంటే.. 2021-22లో 2,78,833కి చేరింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles