25.7 C
Hyderabad
Sunday, May 19, 2024

వెస్ట్ బెంగాల్‌లో టీచర్లపై వేటు.. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎంలకు ఓటేయెద్దన్న మమత!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో 26,000 మంది ఉపాధ్యాయుల ఉద్యోగాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ప్రతిస్పందించారు. ఉద్యోగాలు రద్దైన టీచర్లకు ఓ సందేశాన్ని పంపారు. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎంలకు ఓటేయెద్దన్న మమత కోరారు. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు.

బీజీపీ హైకోర్టు కోర్టును కోనుగోలు చేసింది. సుప్రీం కోర్టును కాదు. నాకు ఇప్పటికే సుప్రీం కోర్టు న్యాయం లభిస్తుందని అశిస్తున్నా. బీజేపీ హైకోర్టును, సీబీఐ, ఎన్ఐఏ, బీఎస్ఎఫ్, సీఏపీఎస్ వంటి ప్రభుత్వం సంస్థలను కొనుగోలు చేసింది. దూరదర్శన్ ఛానెల్ కలర్ మార్చింది. ఛానెల్ వాళ్లు కేవలం బీజేపీ, మోదీ గుర్పించి మాత్రమే ప్రసారాలు చేస్తారు. దూరదర్శన్ ఛానల్ చూడకండి. ఆ ఛానెల్ బాయ్కాట్ చేయండి’ అని మమతా బెనర్జీ కోరారు.

ఈ వారం ప్రారంభంలో, కలకత్తా హైకోర్టు ప్రభుత్వ-ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల కోసం 2016లో నిర్వహించిన టీచర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను రద్దు చేసింది, కొంతమంది అభ్యర్థులు ఉద్యోగాలు పొందడానికి లంచం ఇచ్చారని పేర్కొంది. ఉపాధ్యాయ నియామకాల కేసులో మాజీ విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ సహా పలువురు తృణమూల్ నేతలు, మాజీ అధికారులు జైలులో ఉన్నారు.

అయితే ఈ చర్య ఒక్కసారిగా 26,000 మంది ఉపాధ్యాయులను నిరుద్యోగులను చేసింది. 12% వడ్డీతో తమ జీతాలను తిరిగి ఇవ్వాలని హైకోర్టు వారిని కోరింది. ఈ ఉత్తర్వులను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.

2019లో రాష్ట్రంలోని 42 సీట్లలో 18 సీట్లు గెలుచుకున్న బీజేపీ తన ఉనికిని మరింత విస్తరించుకోవాలని భావిస్తున్న సమయంలో కోర్టు ఉత్తర్వు పెద్ద ఎదురుదెబ్బ కానుంది.  సందేశ్‌ఖాలీ వివాదంతో వెనకంజలో ఉన్న మమతా దీదీకి హైకోర్టు తీర్పు ఒక ఆశాకిరణంలా కనిపిస్తోంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles