26.2 C
Hyderabad
Saturday, May 18, 2024

మానవతా సహాయం కోసం గాజాలో ‘తాత్కాలిక ఓడరేవు’ను నిర్మించనున్న అమెరికా!

వాషింగ్టన్: ముట్టడిలో ఉన్న గాజాలో మానవతా సాయం అందించేందుకు వీలుగా అక్కడ ఓ తాత్కాలిక ఓడరేవును నిర్మించాలని పెంటగాన్ భావిస్తోంది. దీన్ని నిర్మించేందుకు సుమారు 60 రోజులు పడుతుందని పెంటగాన్ ప్రతినిధి మేజర్ జనరల్ పాట్ రైడర్ జర్నలిస్టులతో మాట్లాడుతూ అన్నారు.

ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన స్టేట్ ఆఫ్ ద యూనియన్ ప్రసంగంలో ప్రకటించనున్నట్లు సీనియర్ అధికారులు తెలిపారు.

“గాజాకు మానవతా సహాయం అందించడానికి తాత్కాలిక కాజ్‌వేకి సరుకును రవాణా చేయడానికి,   చిన్న కార్గో  నౌకలను అనుమతించే తాత్కాలిక ఆఫ్‌షోర్ సముద్ర మార్గాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు.”

“ఈ తాత్కాలిక ఓడరేవు నిర్మించేందుకు కి 1,000మంది సిబ్బంది అవసరమని, దీని నిర్మాణానికి 60 రోజుల వరకు పడుతుందని” పెంటగాన్ ప్రతినిధి మేజర్ జనరల్ పాట్ రైడర్ చెప్పారు.

ఈ ఓడరేవు నిర్మించాక “గాజా పౌరులకు రోజుకు రెండు మిలియన్ల కంటే ఎక్కువ మందికి భోజనాన్ని అందించగలమని పెంటగాన్ ప్రతినిధి చెప్పారు. ఈ ప్రయత్నంలో భాగంగా “గాజాలో US దళాలు ఏవీ ఉండవు”, మేము కేవలం  “ప్రాంతీయ భాగస్వాములతో కలిసి పని చేస్తామని చెప్పారు.”

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles