26.2 C
Hyderabad
Saturday, May 18, 2024

“మిస్‌ యూనివర్స్‌” పోటీలో సౌదీ అరేబియా!

రియాద్: సంప్రదాయ ఇస్లామిక్ సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది.  ఫ్యాషన్‌ రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మంగా భావించే మిస్‌ యూనివర్స్‌ 2024 అందాల పోటీలకు తొలిసారి సౌదీ అరేబియా పాల్గొనబోతోంది. దీంతో సౌదీవైపు ప్రపంచ దేశాలన్నీ దృష్టిసారించాయి.

మెక్సికోలో జరిగే ఈవెంట్‌లో  తమ దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఇరవై ఏడేళ్ల సౌదీ మోడల్ రూమీ అల్-ఖహ్తానీ సిద్ధమైంది. ఈ విషయాన్ని ఈ అందాల భామ తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా సోమవారం (మార్చి 26) స్వయంగా వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మిస్‌ యూనివర్స్‌ పోటీలకు తన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రకటించింది.

“మిస్ యూనివర్స్ 2024లో పాల్గొనడం గౌరవంగా ఉంది” అని అల్ఖహ్తానీ  ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు. మిస్ యూనివర్స్ పోటీలో సౌదీ అరేబియా పాల్గొనడం ఇదే తొలిసారి.

ఆ పోస్టులో  ఆమె సౌదీ అరేబియా జెండాను పట్టుకుని సీక్విన్డ్ గౌను, మిస్ యూనివర్స్-సౌదీ అరేబియా శాష్‌ను ధరించి ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది.

రూమీ ఇన్‌స్టాగ్రామ్‌ లింక్

https://www.instagram.com/p/CoOBlIiMIRM/?utm_source=ig_web_button_share_sheet

రూమీ అల్-ఖహ్తానీ ఎవరు?
రియాద్‌కు చెందిన రూమీ అల్-ఖహ్తానీ మిస్ ప్లానెట్ ఇంటర్నేషనల్, మిస్ ఉమెన్ ఇంటర్నేషనల్ బ్యూటీ కాంటెస్ట్, మలేషియాలోని మిస్ గ్లోబల్ ఏషియన్ వంటి అనేక అందాల పోటీల్లో పాల్గొన్నారు.

ఆమె డెంటిస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. ఇంగ్లీష్, ఫ్రెంచ్, అరబిక్ భాషలలో నిష్ణాతులు, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మిలియన్ మంది ఫాలోవర్లు ఆమెను అనుసరిస్తున్నారు.

సౌదీ దేశ ప్రస్తుత క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సాద్ హాయంలో ఈ తరహా చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇస్లామిక్ దేశం తన సంప్రదాయ ముద్రను తొలగించుకునేందుకు ప్రయత్నిస్తోందన్న వాదనలు స్థానికంగా వినిపిస్తున్నాయి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles