35.2 C
Hyderabad
Saturday, May 4, 2024

“ప్రచారభేరి”కి సిద్ధమైన ఆంధ్రప్రదేశ్!

విజయవాడ: రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలకు గడువు సమీపిస్తున్న సమయంలో ఏపీలో విభిన్న రాజకీయ పార్టీల ఊపందుకోనుంది.  ప్రధాన పోటీదారులు – వైఎస్సార్సీపీ, NDA మిత్రపక్షాలు నేటినుంచి తమ పూర్తి స్థాయి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘మేమంత సిద్ధం’ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. కొన్ని బహిరంగ సభలు, రోడ్‌షోలు, కింది స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశాల్లో ఆయన ప్రసంగించనున్నారు.

సీఎం తన బస్సు యాత్రలో ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు అన్ని నియోజకవర్గాలను కవర్ చేయనున్నారు. కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీఎన్ పల్లి (కమలాపురం), గంగిరెడ్డిపల్లి, ఉరుటూరు, యర్రగుంట్ల (జమ్మలమడుగు), పొట్లదుర్తిలో ఆయన పర్యటించనున్నారు.

ఇక టిడిపి అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు అదే రోజు  ప్రజాగళం కార్యక్రమాన్ని ప్రారంభించ నున్నారు. రోడ్‌షోలు, బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. మార్చి 31 వరకు ప్రతిరోజూ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

పలమనేరు నియోజకవర్గం మొదలు నగరి, నెల్లూరు రూరల్ మండలం రాప్తాడు, సింగనమల, కదిరి అసెంబ్లీ నియోజకవర్గాలు, శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, సంతనూతలపాడులో పర్యటించనున్నారు.

మరోవంక నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు బీజేపీ టిక్కెట్టు దక్కించుకోలేకపోయిన వైఎస్సార్‌సీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ అభ్యర్థిగా ఇంకా కొంతమంది అభ్యర్థులను ప్రకటించాల్సిన భాజపా మంగళవారం ఎన్నికల వ్యూహం, ప్రచారానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ఆఫీస్ బేరర్ల సమావేశాన్ని నిర్వహించింది.

ఈమేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు డి.పురందేశ్వరి తెలిపిన వివరాల ప్రకారం.. ఆశావహుల జాబితా చాలా ఎక్కువగా ఉండడంతో అభ్యర్థుల పేర్లను ప్రకటించడంలో జాప్యం జరిగిందని అన్నారు. ఇక విజయవాడ పశ్చిమ నుంచి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి (బీజేపీ) పోటీ చేయనున్నట్లు తెలిసింది. బీజేపీ, జనసేన మధ్య సుదీర్ఘ చర్చల తర్వాత ఈ ఒప్పందం కుదిరింది.

ఎన్డీఏ మిత్రపక్షం, జనసేన కూడా శనివారం నుండి తన ప్రచారాన్ని స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఆ తరువాత జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న అన్ని నియోజకవర్గాలను కవర్ చేస్తూ పవన్ తన రాష్ట్రవ్యాప్త ఎన్నికల ప్రచారాన్ని మూడు దశల్లో ముగించనున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles