26.2 C
Hyderabad
Saturday, May 18, 2024

లోక్‌సభ ఎన్నికల్లో తొలి దశ ఓటింగ్ ముగిసింది…62శాతం పోలింగ్ నమోదైంది!

న్యూఢిల్లీ: మణిపూర్‌లో జాతి-కలహాలు, చెదురుమదురు ఘర్షణలు, కాల్పులు, బెదిరింపుల సంఘటనల మధ్య  లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. మొత్తం 16.63 కోట్ల మంది ఓటర్లలో కనీసం 62 శాతం మంది 102 నియోజకవర్గాల్లో తమ ఓటు వేశారు. పశ్చిమ బెంగాల్‌లో స్వల్ప ఘర్షణలు, నాగాలాండ్‌లో   ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటరీ’ (ఎఫ్ఎన్టీ) బంద్ పిలుపుతో ఈ ప్రాంతంలోని ఆరు జిల్లాల్లో ఓటు వేయడానికి ఎవరూ హాజరు కాలేదు.

ఉదయం 7 గంటలకు ప్రారంభమైన సాయంత్రం ఆరుగంటలదాకా కొనసాగింది. జాతుల మధ్య వైరంతో రావణకాష్టంలో రగిలిపోయిన మణిపూర్‌లో ఇంఫాల్ ఈస్ట్’, ‘ఇంఫాల్ వెస్ట్’లోని నాలుగు పోలింగ్ బూత్‌లలో ఆగంతకులు ఈవీఎంలను ధ్వంసంచేశారు. ఒక పోలింగ్  బూత్‌ను నాశనంచేశారు. బూత్ క్యాప్చర్ ఆరోపణలపై సోషల్ మీడియాలో వీడియోలు వెలువడ్డాయి, యువకులు పోలింగ్ స్టేషన్ ఆవరణలోకి వెళుతున్నట్లు చూపుతున్నారు. అయితే ఇక్కడ మొత్తమ్మీద 69.13 శాతం పోలింగ్ జరిగింది.

సానుకూల అంశం ఏమిటంటే, గ్రేట్ నికోబార్ దీవులలోని ప్రత్యేకించి విల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ (PVTC) అయిన షోంపెన్ తెగకు చెందిన ఏడుగురు సభ్యులు కూడా మొదటిసారి ఓటు వేశారు, బస్తర్‌లోని 56 గ్రామాల ఓటర్లు తమ గ్రామంలోని పోలింగ్ బూత్‌లో ఫస్ట్ టైం ఓటు వేశారు.

నితిన్ గడ్కరీ, కనిమొళి, గౌరవ్ గొగోయ్, భూపేంద్ర యాదవ్ వంటి ప్రముఖ నాయకులు సహా 1.625 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. మొత్తం  ఏడు దశల ఎన్నికలలో మొదటి దశ పోలింగ్ “చాలా ప్రశాంతంగా” జరిగిందని ఎన్నికల సంఘం తెలిపింది.

13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 89 స్థానాలకు రెండవ దశ ఓటింగ్ ఏప్రిల్ 26న నిర్వహించనున్నారు.  ఏడవ – చివరి దశ జూన్ 1న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది.
ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పుదుచ్చేరి, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లతో సహా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొదటి దశలో పోలింగ్ 62:37 శాతంగా నమోదైంది. పోలింగ్ బూత్‌ల డేటాతో పాటు పోస్టల్ బ్యాలెట్‌ల డేటాను క్రోడీకరించిన తర్వాత ఓటింగ్ గణాంకాలు పెరిగే అవకాశం ఉంది.

రాష్ట్రాలలో, త్రిపురలో అత్యధిక పోలింగ్ శాతం 80 52 శాతం నమోదు కాగా, పశ్చిమ బెంగాల్ (3 సీట్లు) 77. 57 శాతం, పుదుచ్చేరి (1) 73.50 శాతం, అత్యల్పంగా బీహార్‌లో ఓటింగ్ నమోదైంది. నాలుగు స్థానాల్లో కేవలం 48.50 శాతం ఓటర్లు మాత్రమే పోలింగ్‌కు హాజరయ్యారు.

పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన తమిళనాడు (39), అండమాన్ – నికోబార్ దీవులు (1), అరుణాచల్ ప్రదేశ్ (2), లక్షద్వీప్ (1), మేఘాలయ (2), మిజోరాం (1), నాగాలాండ్ (1) అన్ని స్థానాలకు ఓటింగ్ ముగిసింది. , పుదుచ్చేర్జి (1) సిక్కిం (1) , ఉత్తరాఖండ్ (1) ఒక్క స్థానానికి  ఓటింగ్ మొదటి దశలో జరిగింది.

రాజస్థాన్ (12), ఉత్తరప్రదేశ్ (8), మధ్యప్రదేశ్ (6) అస్సాం, మహారాష్ట్ర (5 , బీహార్ (4), పశ్చిమ బెంగాల్ (3), మణిపూర్ (2),  త్రిపుర, జమ్మూ – కాశ్మీర్, ఛత్తీస్‌గఢ్‌లో ఒక్కో స్థానానికి ఎన్నిక జరిగింది.

2019 ఎన్నికలలో, మొదటి దశలో 91 స్థానాల్లో 69.5 శాతం 14 2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  2019లో పోలింగ్ శాతం 67.4 గా నమోదైంది.

తరచూ మావోలు, బటగాల ఎదురుకాల్పుల మోగతో దద్దరిల్లే ఐస్తర్ (ప్రాంతం ఉన్న చత్తీస్ గఢ్ 63.41 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా గాల్గమ్ గ్రామంలో పోలింగ్ కేంద్రం సమీపంలో అండర్ బ్యారల్ గనేడ్ లాంచర్ పొరపాటున పేలడంతో సీఆర్డీఎఫ్ ఆవారు దేవేంద్ర తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు.

తమిళనాడు రాష్ట్రంలోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 72.09 శాతం పోలింగ్ నమోదైంది. తాంబరం సహా కొన్ని పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలలో సాంకేతిక కారణాలతో పోలింగ్ గంట ఆలస్యంగా ఆరంభమైంది. సేలంలో ఇద్దరు వృద్ధులు ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చి మరణించారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి స్టాలిన్, మాజీ సీఎంలు సన్నీర్ సెల్వం, కె.పళనిస్వామి, తమిళసూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హసన్, విజయ్, అజిత్ కుమార్ తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులో 2019 ఎన్నికల్లో 72.44 శాతం పోలింగ్ నమోదైంది.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles