35.2 C
Hyderabad
Saturday, June 1, 2024

భారతీయులు సోదరభావంతో మెలగండి… జేఐహెచ్ చీఫ్ సాదతుల్లా హుస్సేనీ పిలుపు!

న్యూఢిల్లీ : జమాతే ఇస్లామీ హింద్ (JIH)  దేశ రాజధానిలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో     ఈద్-మిలాప్  కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ప్రోగ్రాంలో విదేశీ దౌత్యవేత్తలు, సర్వమత నాయకులు, ప్రజాసంఘాల నేతలు, కార్యకర్తలు, రాజకీయ నాయకులు, పాత్రికేయులు, మేధావులు పాల్గొన్నారు.

సభను ఉద్దేశించి JIH అధ్యక్షుడు సయ్యద్ సదాతుల్లా హుస్సేనీ మాట్లాడుతూ…ఈద్-మిలాప్  ఈ కార్యక్రమానికి  హాజరైన ప్రముఖులకు, అతిథులకు ఘన స్వాగతం పలికారు. “ఈద్ వేడుకల సందర్భంగా మా సంతోషాలలో… సమాజంలో అణగారిన, పేద ప్రజలను చేర్చుకుంటామని,” ఆయన చెప్పారు.

ఈద్ వేడుకల సందర్భంగా సామాజిక బాధ్యత ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన ఆయన, ప్రతి ఒక్కరూ వెనుకబడిన వారిని గుర్తుంచుకోవాలని, మరింత న్యాయమైన,  సమానమైన సమాజం కోసం కృషి చేయాలని కోరారు. “ఈ దేశంలో మనమందరం కలిసి శాంతి, న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పేందుకు, ప్రతి పౌరునికి హక్కులు కల్పించేందుకు కృషి చేస్తామని” హుసేనీ పేర్కొన్నారు.

భారతదేశాన్ని శాంతి, సౌహార్దానికి నిలయంగా మార్చాలనే నిబద్ధతను పునరుజ్జీవింపజేయాలని ఆయన పిలుపునిచ్చారు.   ప్రపంచవ్యాప్తంగా హింస, అణచివేతపై సాదతుల్లా హుసేనీ ఆందోళన వ్యక్తం చేశారు, ముఖ్యంగా పాలస్తీనాలో పాలస్తీనియన్లు “ప్రపంచ చరిత్రలో అత్యంత దారుణమైన హింసను” ఎదుర్కొంటున్నారని అన్నారు.

రిపబ్లిక్ ఆఫ్ టర్కీ రాయబార కార్యాలయం కౌన్సెలర్ అహ్మెత్ యిల్డిజ్‌తో JIH అధ్యక్షుడు సయ్యద్ సదాతుల్లా హుసైనీ (ఎడమ)

హింసను ఎదుర్కొంటున్న పాలస్తీనియన్లకు సంఘీభావం తెలుపుతూ, పాలస్తీనియన్లపై కొనసాగుతున్న దమనకాండను ఎత్తిచూపారు. ప్రపంచవ్యాప్తంగా అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్ ఏర్పడాలని పిలుపునిచ్చారు. “అన్ని రకాల హింసలు, దోపిడీలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం చేయడం మా బాధ్యత. ఈ విషయంలో గతంలో మాదిరిగానే భవిష్యత్తులో కూడా మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాను” అని  హుసేనీ అన్నారు.

ఈద్-ఉల్-ఫితర్  ప్రాముఖ్యతను వివరిస్తూ, పవిత్ర ఖురాన్ ప్రవక్త ముహమ్మద్ (స)కి అవతరించిన రంజాన్ ఉపవాస మాసం చివరిలో పండుగ జరుపుకుంటారు. “రంజాన్ మాసంలో ముస్లింలు ఖురాన్‌ను అనుసరించి ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని పొందేందుకు కృషి చేస్తారు” అని ఆయన చెప్పారు.

ఈద్-ఉల్-ఫితర్ ఇస్లాం  ప్రాథమిక సందేశాన్ని సూచిస్తుందని JIH చీఫ్ పేర్కొన్నారు. మానవులందరూ ఒకే దేవుని ఆరాధించాలని కోరారు. వారు  ఒకరికొకరు సోదరులు. “మేమంతా సోదరులుగా కలిసి జీవించాలని, సృష్టికర్త అయిన ఏకైక దేవుడికి కట్టుబడి ఉండాలని మేము ఈద్ సందర్భంగా ప్రకటిస్తామని,” అని ఆయన చెప్పారు.

ఈద్ గెట్‌టుగెదర్‌లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల విభిన్న సమ్మేళనం జరిగింది. విదేశీ దౌత్యవేత్తలలో ఇరాన్ రాయబారి డాక్టర్ ఇరాజ్ ఇలాహి, పాలస్తీనా రాయబారి అద్నాన్ అల్హైజా, న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లోని రెండవ సెక్రటరీ తారిక్ మస్రూఫ్, రిపబ్లిక్ ఆఫ్ టర్కీయే రాయబార కార్యాలయం కౌన్సెలర్ అహ్మద్ యిల్డిజ్ ఉన్నారు. USA, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, టర్కీ, పాకిస్తాన్, అల్జీరియా, ఇండోనేషియా, లిబియా, మలేషియా,  బ్రూనై నుండి సీనియర్ దౌత్యవేత్తలు,  సలహాదారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ధర్మ సంసద్ వ్యవస్థాపకుడు గోస్వామి సుశీల్ మహరాజ్, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ జాన్ దయాల్, మానవ హక్కుల కార్యకర్త రవి నాయర్‌తో సహా పలువురు భారతీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. జమియత్ అహ్లే హదీత్ అధ్యక్షుడు మౌలానా అస్గర్ అలీ ఇమామ్ మెహదీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) జనరల్ సెక్రటరీ మౌలానా మహమ్మద్ ఫజ్లూర్ రహీమ్ ముజద్దిదీ కూడా  ఈద్ మిలాప్ వేడుకల్లోపాల్గొన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles