28.2 C
Hyderabad
Saturday, May 18, 2024

నేడు 23 తాగునీటి స్టోరేజ్ ట్యాంక్‌లను ప్రారంభించనున్న జలమండలి!

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) ఓఆర్‌ఆర్ ఫేజ్ టూ ప్రాజెక్టు కింద చేపట్టిన మొత్తం 23 తాగునీటి స్టోరేజ్ ట్యాంక్‌లు ఆరు లక్షల మందికి పైగా పౌరుల దాహార్తిని తీర్చేందుకు సిద్ధమయ్యాయి. మొత్తం 320.94 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ తాగునీటి రిజర్వాయర్లను నేడు ఆయా ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు.

రెండు ప్యాకేజీలుగా చేపట్టిన ఈ తాగునీటి స్టోరేజ్ ట్యాంకులు… ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 24 గ్రామ పంచాయతీల పరిథిలో నిర్మితమయ్యాయి. ఈ ప్రాజెక్టు పరిధిలోని 12 మండలాల్లో సరూర్‌నగర్‌, శంషాబాద్‌, ఘట్‌కేసర్‌, కీసర, రాజేంద్రనగర్‌, మేడ్చల్‌, కుతుబుల్లాపూర్‌, బోలారం తదితర మండలాల తాగునీటి అవసరాలు తీరుతాయి.

నేడు 23 తాగునీటి రిజర్వాయర్లు ప్రారంభోత్సవం జరుపుతుండగా, మరో 50 రిజర్వాయర్లు త్వరలో పని చేయటం ప్రారంభిస్తాయి. మొత్తం రూ. 1200 కోట్లతో చేపట్టిన ఈ ట్యాంకుల నిర్మాణంతో  3.6 లక్షల కుటుంబాలకు చెందిన 25 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. 138 మిలియన్ లీటర్ (ML) సామర్థ్యం, 2988 కి.మీ ఇన్లెట్ మరియు అవుట్‌లెట్ డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్‌లతో వీటిని నిర్మించారు. ఇవి రోజుకు 75 నుండి 100 లీటర్ల తలసరి సరఫరాను (lpcd) 150 lpcd వరకు మెరుగుపరుస్తుంది. ఇప్పటికే ఉన్న ప్రాంతాలకు నీటి సరఫరాను మెరుగుపరచడంతో పాటు, గతంలో అందించని కొన్ని ప్రాంతాలు కూడా ప్రయోజనం పొందుతాయి.

తాగునీటి రిజర్వాయర్లు: మొత్తం ఖర్చు (రూ. కోట్లలో)

  1. శ్రీనివాసనగర్ 6.86
  2. రైతు బజార్ 7.66
  3. పీర్జాదిగూడ 17.55
  4. తట్టిఅన్నారం 8.62
  5. CNR క్రికెట్ గ్రౌండ్ దగ్గర 35.82
  6. కావేరీ ఫంక్షన్ హాల్ దగ్గర 20.62
  7. ఆదిభట్ల 12.99
  8. తుక్కుగూడ 20.2
  9. అన్నోజిగూడ 6.94
  10. కిస్మత్పూర్ 2.47
  11. అభ్యుదయ నగర్ 6.22
  12. బైరాగిగూడ 3.63
  13. బృందావన్ కాలనీ 7.42
  14. నార్సింగి 3.86
  15. గండిపేట MRO కార్యాలయం 13.35
  16. అపెరల్ పార్క్ 13.87
  17. అపెరల్ పార్క్ 2.92
  18. పీజేఆర్ కాలనీ 1 – 15.61
  19. పీజేఆర్ కాలనీ 2
  20. బీరంగూడ 18.02
  21. ద్వారకాపురి కాలనీ 3.66
  22. అపర్ణ పామ్ గ్రోవ్స్ 10.51
  23. కమ్మగూడ 92.15

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles