32.2 C
Hyderabad
Saturday, May 18, 2024

నేతలు, పార్టీల భవితవ్యాన్ని నిర్ణయిస్తోన్న ‘సోషల్ మీడియా’!

కరీంనగర్: ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి సోషల్ మీడియా పాక్షికంగా కారణమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఒకరు అంగీకరించారు. అంతేకాదు గతంలో జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రచారంలో ఆయా పార్టీలు విజయం సాధించిన సందర్భాలున్నాయి. సోషల్ మీడియా రాజకీయ పార్టీల మనుగడను అలాగే అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుందనేది వాస్తవం.  సోషల్ మీడియాలో కొన్ని పోస్టుల వల్ల పార్టీపైనా, అభ్యర్థులపైనా ప్రజల్లో ఎప్పటికప్పుడు అభిప్రాయం మారుతోంది. సోషల్ మీడియా ఒక పార్టీ గ్రాఫ్ పెంచితే.. మరో పార్టీని అదే రేంజ్ లో దెబ్బతీయవచ్చు.

సోషల్ మీడియాలో పోస్ట్‌ల విశ్వసనీయతను పక్కన పెడితే, వాటిలో చాలా వరకు నిజమని నమ్ముతారు. దీంతో రాజకీయ పార్టీలు సంప్రదాయ పద్ధతులతో పాటు ప్రచారాలను నిర్వహించేందుకు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. ఈరోజు ఎన్నికలను సోషల్ మీడియా శాసిస్తోంది.  అందుకే వార్తాపత్రికలు కూడా డిజిటల్,స్మార్ట్ ఎడిషన్లను ప్రారంభించాయి, వెబ్ వార్తలను ప్రత్యేకంగా ఇస్తున్న సంగతి చెప్పనవసరం లేదు. 2019 పార్లమెంట్ ఎన్నికల కంటే 2024 ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని ప్రవేశపెడుతూ ప్రచారంలో కొత్త ఒరవడిని సృష్టించింది.

కరీంనగర్ పార్లమెంట్ విషయానికి వస్తే, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గత ఎన్నికల్లో సోషల్ మీడియా టీమ్‌లను ప్రవేశపెట్టి ప్రచారం చేశారు. అదేవిధంగా బీఆర్‌ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సోషల్ మీడియా టీమ్‌లను కూడా ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు.  అసెంబ్లీలో బండి సంజయ్ ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు ముందు సోషల్ మీడియా టీమ్‌లు ఏర్పాటు చేసి సోషల్ మీడియా వారియర్స్ పేరుతో సదస్సు నిర్వహించారు. ఇప్పుడు ఈ ఇద్దరు అభ్యర్థుల సోషల్ మీడియాలో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ వెనుకబడింది.

మిగతా పార్టీలు సైతం ప్రత్యేక సోషల్ మీడియా వింగ్‌లను కూడా ఏర్పాటు చేశాయి. పార్టీ కార్యకలాపాలు, ప్రచార వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పార్టీకి మైలేజీ వచ్చేలా ఇవి ప్రయత్నిస్తున్నాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్, బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు.

టెక్నాలజీని నేర్చుకోలేక కొందరు నేతలు కన్సల్టెంట్ల సాయం తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఎంపీ అభ్యర్థులు ప్రత్యేకంగా సోషల్ మీడియా టీంలను ఏర్పాటు చేసుకున్నారు. ప్యాకేజీలు ఇవ్వడంతో యువతకు ఉపాధి మార్గంగా మారింది. పార్టీలు, అభ్యర్థులు ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి, వారి తరపున ప్రచారం చేయడానికి ప్రత్యేక సోషల్ మీడియా బృందాలను నియమించుకుంటున్నారు. అభ్యర్థుల ప్రచారం కోసం కోట్లు ఖర్చుకు ఏ పార్టీ వెనుకాడదు.

డిజిటల్ పొలిటికల్ మార్కెటింగ్ ఏజెన్సీలు డిమాండ్‌కు అనుగుణంగా నియామకాలు జరుపుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రత్యేకంగా, పరోక్షంగా ప్రచారం సాగుతోంది. దాదాపు ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఓటర్లకు చేరువ కావడం సులువైంది. సోషల్ మీడియాతో ప్రమోషన్ అనేది ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ట్రెండ్.

ఇదిలా ఉండగా ఎన్నికల సంఘం నిఘా ప్రత్యేక కమిటీ సోషల్ మీడియా ఆధ్వర్యంలో సామాజిక మాద్యమాల్లో వస్తున్న వార్తలు నిబంధనలను ఉల్లంఘించినా, రెచ్చగొట్టే పోస్టింగ్‌లు చేసినా, మత విద్వేషాలు రెచ్చగొట్టినా చర్యలు తీసుకుంటామన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles