26.2 C
Hyderabad
Saturday, May 18, 2024

ఉర్దూ మీడియంలో ‘లా కోర్సు’లను ప్రవేశపెట్టిన ‘మనూ’ వర్సిటీ!

హైదరాబాద్: మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) 2024-25 విద్యా సంవత్సరం నుండి ఉర్దూ మీడియంలో లా కోర్సులను అందిస్తుంది. ఈ విషయాన్ని వైస్ ఛాన్సలర్ ప్రొ.సయ్యద్ ఐనుల్ హసన్  ప్రకటించారు.

ప్రస్తుతం, MANUU BA LLB (ఆనర్స్), లీగల్ స్టడీస్‌లో MA, ఆరు స్పెషలైజేషన్‌లతో LLM,  PhD (లా) ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఈ కోర్సులను ఇప్పుడు ఉర్దూ మాధ్యమంలో అందించనున్నారు.

దీని కోసం ఆన్‌లైన్ ఫారమ్‌లను సమర్పించడానికి గడువు మే 20, 2024గా నిర్ణయించారు. అయితే, MA ఇన్ లీగల్ స్టడీస్ కోర్సు కోసం దరఖాస్తులను జూన్ 30 వరకు సమర్పించవచ్చు.

ఆసక్తిగల అభ్యర్థులు మరింత సమాచారం కోసం www.manuu.edu.in  విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని, ఉర్దూ మాధ్యమంలో కొత్తగా ప్రవేశపెట్టిన లా కోర్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్ విజ్ఞప్తి చేశారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles