25.7 C
Hyderabad
Sunday, May 19, 2024

మెట్రో రైల్‌ గుడ్‌ న్యూస్‌

హైదరాబాద్ మెట్రో రైల్‌ ప్రయాణికులకు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అత్యధిక జనసాంద్రత కలిగిన మెట్రో స్టేషన్లతో పాటు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ట్రైన్స్‌ అన్నింటా షుగర్‌ బాక్స్‌ నెట్‌వర్క్స్‌ కనెక్టివిటీ ఇస్తున్నారు. దేశంలోనే తొలి ప్రజా రవాణా వ్యవస్థగా హైదరాబాద్‌ మెట్రో రైల్‌ తమ ప్రయాణికులకు కంటెంట్‌ను ఉచితంగా డౌన్‌లోడ్, స్ట్రీమ్‌ చేసుకునే అవకాశాన్ని ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేకున్నా అందిస్తుంది. విమానాలలో ఏ విధంగా అయితే సేవలు లభ్యమవుతాయో అదే రీతిలో రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల నగరంలో షుగర్‌ బాక్స్‌ నెట్‌వర్క్స్‌ నిర్వహించిన అధ్యయనంలో మెట్రో రైల్‌ ప్రయాణికులు ప్రయాణ సమయాన్ని దాదాపు 60 నిమిషాలు తమ ఫోన్లలోనే గడుపుతున్నట్టు వెల్లడైంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles