Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఫార్మా యూనిట్‌లో రియాక్టర్ పేలుడు… ఇద్దరు మృతి, తొమ్మిది మందికి గాయాలు!

హైదరాబాద్: తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పోచంపల్లి మండలంలోని యూనిట్‌లో కార్మికులు షిఫ్టులు మారుస్తుండగా శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఈ ఘటన జరిగింది. దీంతో మంటలు చెలరేగాయి. “ఇద్దరు మృతి చెందారు. తొమ్మిది మంది గాయపడ్డారు, వీరిలో ఇద్దరికి 50 శాతానికి పైగా కాలిన గాయాలవ్వగా, ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి” అని ఒక పోలీసు […]
Read more

సీఎం రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటన రద్దు…అనుమతి నిరాకరించిన కేంద్రం!

హైదరాబాద్: అమెరికాలో పర్యటించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రం అనుమతి నిరాకరించిందని ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) తెలిపింది. ప్రస్తుతం లండన్‌లో ఉన్న సీఎం, అమెరికాలో పర్యటించి ఆగస్టు 30న హైదరాబాద్‌కు తిరిగి రావాలని ప్రణాళిక వేసుకున్నారు. “రాజకీయ కోణంలో అనుమతి నిరాకరించినట్లు” విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొనడంతో, ముఖ్యమంత్రి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ (TelanganaRising) అధికారిక బృందం తమ అమెరికా పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని CMO ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, కేంద్రం నిర్ణయంపై […]
Read more

దేశ ఇంధన భద్రతకు సింగరేణి సిద్ధం… సీఎండీ బుద్ధప్రకాష్‌!

కొత్తగూడెం: దేశానికి తగినంత బొగ్గు సరఫరాను అందించడంతో పాటు, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో తన ఉనికిని విస్తరించడం ద్వారా దేశ ఇంధన భద్రతకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్) దోహదపడుతుందని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాస్ జ్యోతి తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన ఇండియన్ ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్‌పోలో భాగంగా “ఇంధన భద్రత, విద్యుత్ ఉత్పత్తి” అనే అంశంపై నిర్వహించిన ప్యానెల్ చర్చలో సీఎండీ మాట్లాడుతూ… దశాబ్దాలుగా బొగ్గును సరఫరా చేయడం ద్వారా […]
Read more

మీ నాన్న కూడా ఆపలేరు… సీఎంకు సవాల్ విసిరిన కొండా సురేఖ కూతురు!

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డిపై… మంత్రి కొండా సురేఖ కుమార్తె కూతరు సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి పరకాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని బలపరచడంపై మండిపడిన ఆమె, మీ నాన్న వచ్చినా, తాత వచ్చినా పరకాల బరిలో తాను ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేసి గెలుస్తానని ఛాలెంజ్ చేశారు. కాగా, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఒక సీనియర్ మంత్రి కుమార్తె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా విమర్శలు గుప్పించడం, పార్టీలో నెలకొన్న అసమ్మతిని వెలుగులోకి తెచ్చింది. […]
Read more

సెక్షన్ 22A నిషేధిత భూముల వ్యవహారం… రెవెన్యూ మంత్రి రాజీనామాకు BRS డిమాండ్!

హైదరాబాద్‌: రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A కింద లక్షలాది మంది భూ యజమానుల ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడం ద్వారా వారిలో గందరగోళం, ఆందోళన కలిగించినందుకు గాను, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని భారత్ రాష్ట్ర సమితి (BRS) డిమాండ్ చేసింది. ఈమేరకు మల్కాజిగిరిలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అసెంబ్లీలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి. హరీష్ రావు మాట్లాడుతూ, సెక్షన్ 22A కింద చేర్చిన […]
Read more

నిషేధిత జాబితాలోని భూముల పరిశీలనను వేగవంతం చేస్తామని సీఎం రేవంత్ హామీ

హైదరాబాద్: తెలంగాణలో ప్రజల ఆస్తి హక్కును పరిరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, నిషేధిత భూముల సమస్యను త్వరగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈమేరకు రెవెన్యూ మంత్రితో కలిసి ‘సెక్షన్ 22A’ పరిధిలోకి వచ్చే భూములపై ​​ఆయన సమీక్ష నిర్వహించారు. నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తికి సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకుంటే, రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లోనే దాని పరిశీలన ప్రక్రియను పూర్తి చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఆ భూమి ప్రైవేట్ […]
Read more

కే.బీ.ఆర్ పార్కు వద్ద ‘వన్‌ వే’ నరకం!

హైదరాబాద్: నగరంలోని కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ పార్క్ పక్కనుంచి ప్రయాణించే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటుచేసిన వన్‌ వే ఒక పీడకలగా మారింది. ఉదయం రద్దీ వేళల్లో రోడ్లు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. వందల మీటర్ల మేర కార్లు, ద్విచక్ర వాహనాలు బారులు తీరడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. హెచ్-సీఐటీఐ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న మౌలిక వసతుల పనులకు వీలుగా, ట్రాఫిక్‌ను సులభతరం చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కేబీఆర్ పార్క్ చుట్టూ నిన్ను […]
Read more

తెలంగాలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ… మొత్తం 73 లక్షల పేర్ల తొలగింపు!

హైదరాబాద్: ఎన్నికల ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా, హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని అన్ని జిల్లాల ఓటర్ల జాబితాల నుండి మొత్తం 73 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు. ఎన్నికల సంఘం ముసాయిదా జాబితాను సోమవార విడుదల అయింది. తెలంగాణలో మొత్తం 3 కోట్ల 38 లక్షల 26 వేల 448 మంది ఓటర్లు ఉండగా.. 2 కోట్ల 64 లక్షల 87 వేల 213 మంది ఎన్యూమరేషన్‌ పత్రాలను డిజిటలైజేషన్‌ […]
Read more

టీఎస్ఆర్టీసీ ‘మీటికెట్’…ఒకే యాప్‌లో బస్సులు, మెట్రో, ఆటోలు, క్యాబ్‌లు!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ), పలు ప్రజా రవాణా సేవలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి మీసేవ ద్వారా ‘మీటికెట్’ అనే కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ యాప్, ఆర్టీసీ బస్సులు, మెట్రో సేవలు, ఆటోలు, క్యాబ్‌లను ఏకీకృతం చేయడం ద్వారా ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రయాణికులు అదే ప్లాట్‌ఫామ్ ద్వారా ఆర్టీసీ లేదా మెట్రో టిక్కెట్‌ను బుక్ చేసుకోవడంతో పాటు, తదుపరి ప్రయాణం కోసం ఆటో […]
Read more

‘ఇఫ్లూ’లో ఎన్‌ఎస్‌యూఐతో ఘర్షణ పడ్డ ఏబీవీపీ సభ్యులు… అదుపులోకి తీసుకున్న పోలీసులు!

హైదరాబాద్: నగరంలోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ- ఇఫ్లూ క్యాంపస్‌లో ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు గాయపడగా, ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. ఘర్షణ అనంతరం, ఏబీవీపీకి చెందిన ఏడుగురు సభ్యులను జ్యుడిషియల్ కస్టడీకి, ఎన్ఎస్‌యూఐకి చెందిన ఏడుగురికి స్టేషన్ బెయిల్ మంజూరు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయమై ఓయూ సిటీ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు మాట్లాడుతూ… ఇద్దరు […]
Read more
1 2 3 4 5 6 60

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.