31.7 C
Hyderabad
Saturday, May 4, 2024

మాల్దీవుల పార్లమెంట్ ఎన్నికలలో ‘ముయిజ్జు’ పార్టీ ఘనవిజయం!

మాలే:  మాల్దీవుల పార్లమెంట్ ఎన్నికలలో చైనా అనుకూల వైఖరి అనుసరిస్తున్న ఆ దేశాధ్యక్షుడు ముయిజ్జుకు  భారీ మెజారిటీ లభించింది. ఓటర్లు చైనా వైపు మొగ్గు చూపడంతో పాటు ప్రాంతీయ శక్తి కేంద్రమైన భారతదేశానికి దూరంగా ఉన్నట్లు ఈ ఎన్నికలు నిరూపించాయి.

మాల్దీవుల ఎన్నికల సంఘం తాత్కాలిక ఫలితాల ప్రకారం, 93 మంది సభ్యుల పార్లమెంటులో ముయిజుస్ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (PNC) మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ స్థానాలను పొందింది. ఇప్పటివరకు 86 స్థానాల్లో ఫలితాలు ప్రకటించారు. ఇందులో 66 స్థానాల్ని పీఎన్‌సీ కైవసం చేసుకుంది. మరో 7 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాక.. పీఎన్‌సీ మెజార్టీ మరింత పెరిగే అవకాశముంది. ప్రధాన ప్రతిపక్షం ‘ఎండీపీ’ కేవలం 12 స్థానాలకు పరిమితమైంది.

మొత్తం 41 మందిలో ముగ్గురు మహిళా అభ్యర్థులు మాత్రమే ఎన్నికయ్యారు. వీరంతా అధ్యక్షుడు ముయిజ్జు  పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (PNC) పార్టీకి చెందినవారేనని స్థానిక మిహారు వార్తాపత్రిక పేర్కొంది.

దీంతో చైనాతో ఆర్థిక సంబంధాల్ని పెంచుకోవటం, భారీ ప్రాజెక్టులను చైనాకు అప్పగించటం, వివాదాస్పద స్థలంలో వేలాది భవన నిర్మాణాలు.. మొదలైన వాటిపై ముయిజ్జు ప్రభుత్వానికి పార్లమెంట్‌లో అనుకూల పరిస్థితి ఏర్పడింది.

సహజసిద్ధ తెల్లని బీచ్‌లు,  ఏకాంత రిసార్ట్‌ల కారణంగా అగ్రశ్రేణి విలాసవంతమైన విహార కేంద్రంగా మాల్దీవులు ప్రసిద్ధి చెందాయి.

కానీ ఇటీవలి సంవత్సరాలలో ఇది హిందూ మహాసముద్రంలో భౌగోళిక రాజకీయ హాట్‌స్పాట్‌గా మారింది, ప్రపంచ తూర్పు-పశ్చిమ షిప్పింగ్ లేన్‌లు ఈ ద్వీపసమూహం గుండా వెళుతున్నాయి.

మాల్దీవుల పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేస్తున్న అధ్యక్షుడు మయిజ్జు చిత్రాలను Xలో  ఆ దేశ అధ్యక కార్యాలయం ఆ పోస్ట్ చేసిన లింక్ కింద ఇస్తున్నాం..

https://x.com/presidencymv/status/1781918099677323306

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles